వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంటీని రేప్ చేసిన కాంగ్రెస్ పార్టీ కేరళ ఎమ్మెల్యే అరెస్టు: 900 సార్లు ఫోన్లు, డ్రామలు, చివరికి !

వివాహిత మహిళ మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె నిద్రమాత్రలు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాహిత మహిళ మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె నిద్రమాత్రలు మింగి నెయ్యాంతికెరెలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేరళలో ఆంటీని రేప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆత్మహత్యాయత్నం, రాజీకావాలని !కేరళలో ఆంటీని రేప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆత్మహత్యాయత్నం, రాజీకావాలని !

సీపీఎం నాయకురాలు అయిన 51 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చేశారని కేరళలోని కోవలం శాసన సభ్యుడు ఎం. విన్సెంట్ మీద బలరాంపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా కోల్లం సిటీ కమిషనర్ ఎస్. అజితా బేగంను నియమిస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.

మొత్తం చెప్పిన బాధితురాలు

మొత్తం చెప్పిన బాధితురాలు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ అత్యాచారం చెయ్యడంతో బాధితురాలు గత గురువారం నిద్రమాత్రలు మింగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలిని ఆసుపత్రిలోనే విచారణ చేసిన కోల్లం సిటీ పోలీసు కమిషనర్ అజితా బేగం ఎఫ్ఐఆర్ తయారు చేశారు.

నోటీసులు, నాలుగు గంటలు !

నోటీసులు, నాలుగు గంటలు !

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విన్సెంట్ కు పోలీసు అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కొచ్చిలోని కేరళ పోలీసు క్లబ్ లో నాలుగు గంటల పాటు ఎమ్మెల్యే విన్సెంట్ ను విచారణ చేశారు. బాధిత మహిళ మీకు ఎలా తెలుసు అని ఆరా తీశారు.

900 సార్లు ఫోన్ చేసిన ఎమ్మెల్యే !

900 సార్లు ఫోన్ చేసిన ఎమ్మెల్యే !

తనకు ఆమహిళ పరిచయం లేదని, ఆమె ఎవరో కూడా తనకు తెలీదని ఎమ్మెల్యే విన్సెంట్ నాటకాలు ఆడారు. అప్పటికే బాధిత మహిళ భర్త తన భార్యకు ఇప్పటి వరకు 900 సార్లు ఎమ్మెల్యే ఫోన్ చేశాడని మొబైల్ డేటా పోలీసులు ఇచ్చారు.

రేప్ చేశాడని సాక్షాలు !

రేప్ చేశాడని సాక్షాలు !

పోలీసులు బాధిత మహిళకు ఎమ్మెల్యే ఎప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని ఆయన గారికి పూర్తిగా వివరించడంతో ఎమ్మెల్యే విన్సెంట్ కంగుతిన్నాడు. అత్యాచారం చేసి వేధింపులకు గురి చేశాడని ఎమ్మెల్యే మీద బలమైన సాక్షాలు చేతికి చిక్కడంతో ఆలస్యం చెయ్యకుండా పోలీసులు వెంటనే ఎమ్మెల్యే విన్సెంట్ ను అరెస్టు చేశారు.

నేను అమాయకుడు

నేను అమాయకుడు

కాంగ్రెస్ ఎమ్మెల్యే విన్సెంట్ వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ఎవ్వరి మీద అత్యాచారం చెయ్యలేదని, అవనసరంగా కేసులో ఇరికించారని ఎమ్మెల్యే విన్సెంట్ అంటున్నారు.

English summary
Kerala police has held Kovalam Congress MLA M. Vincent on charges of sexual harassment after four hours of questioning in the MLA hostel and then in the police club.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X