వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్షలో కాపీ కొడ్తూ పట్టబడ్డ ఐపీఎస్ అధికారి, ట్విస్ట్, ఇన్విజిలేటర్‌కే షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోచి: కేరళ రాష్ట్రంలో ఓ పోలీసు అధికారి పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డ సంఘటన జరిగింది. అతను ఐజీ. ఒకరు సోమవారం ఎల్‌ఎల్‌ఎం ఫైనల్‌ పరీక్షలో అతను కాపీ కొడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. అతను త్రిస్సూర్‌ రేంజి ఐజీగా పని చేస్తున్నాడు.

అతని పేరు టీజే జోస్‌. కోచి శివారున కలమస్సెరిలోని సెయింట్‌ పాల్‌ కళాశాలలో క్రైమ్‌-2 పరీక్షకు హాజరయ్యారు. తాను తెచ్చుకున్న కొన్ని పేపర్ల నుంచి ఈయన దర్జాగా కాపీ కొడుతుండగా హాలులోని ఇన్విజిలేటర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, బయటికి పంపించేశారు. జోస్‌ను డిబార్ చేశారు.

Kerala IG officer TJ Jose caught cheating in LLM exam at Kochi

ఈ విషయమై మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చైర్మన్ దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుండి నివేదికను కోరినట్లు చెప్పారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తునకు కేరళ సర్కారు ఆదేశించింది. నార్తర్న్ రీజియన్ ఏడీజీపీ శంకర్ రెడ్డి దీనిని విచారిస్తారని కేరళ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ట్విస్ట్ ఏమంటే, తాను పట్టుకున్నది ఐపీఎస్ ఆఫీసర్ అని సదరు ఇన్విజిలేటర్‌కు తెలియదని తెలుస్తోంది.

English summary
A top IPS official was reportedly caught cheating in the LLM exams at Kochi. According to reports, Inspector General of Police of Thrissur range TJ Jose came to the exam hall with the photostat copy of some notes and the invigilator reported the matter. Jose did not hand over the material, but walked out of the exam hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X