వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల హల్‌చల్: లవర్స్ వీడియోపై పోలీస్ బాస్ క్షమాపణ

తిరువనంతపురంలో రెండు రోజుల క్రితం ఓ ప్రాంతంలో ప్రేమ జంటను పోలీసులు వేధించిన సంఘటనలో కేరళ పోలీస్ బాస్ క్షమాపణలు చెప్పారు. ప్రేమజంటతో పోలీసులు వ్యవహరించిన తీరు పోలీస్ చీఫ్ లోక్‌నాథ్‌కు చేరింది.

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: తిరువనంతపురంలో రెండు రోజుల క్రితం ఓ ప్రాంతంలో ప్రేమ జంటను పోలీసులు వేధించిన సంఘటనలో కేరళ పోలీస్ బాస్ క్షమాపణలు చెప్పారు. ప్రేమజంటతో పోలీసులు వ్యవహరించిన తీరు పోలీస్ చీఫ్ లోక్‌నాథ్‌కు చేరింది.

సోషల్ మీడియాలో ఈ ప్రేమజంటతో మహిళా పోలీసులు వ్యవహరించిన తీరు కలకలం రేపగా.. ఆయన అదే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ ఘటన తనను బాధించిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

kerala

ఈ ఘటన గురించి ఓ ఆర్టికల్ కూడా రాశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు కూడా ఆయన తెలిపారు. మన దేశంలో ఉన్న సంస్కృతి ప్రకారం పెళ్లి కాని యువతీ యువకులు బహిరంగ ప్రదేశాల్లో కలిసి తిరగడం తప్పుకావచ్చు, కానీ అది తప్పు అని చెప్పే చట్టమేమీ లేదన్నారు. అయితే, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చర్యలు మాత్రం తప్పవని కేరళ పోలీస్ చీఫ్ లోక్‌నాథ్ హెచ్చరించారు.

పార్క్‌లో లవర్స్.. మహిళా పోలీస్ ఎంట్రీ: వీడియో వైరల్పార్క్‌లో లవర్స్.. మహిళా పోలీస్ ఎంట్రీ: వీడియో వైరల్

కాగా, కేరళ పోలీసులు 'మోరల్ పోలీస్'లుగా వ్యవహరిస్తూ తమను నిలదీస్తున్నారని, ప్రశ్నిస్తున్నారని, జరిమానా విధిస్తున్నారని ఓ జంట ఫేస్‌బుక్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రేమికుల దినోత్సవం తర్వాత సరిగ్గా వారం తర్వాత.. తిరువనంతపురంలోని ఓ పార్కులో ప్రేమ జంట కూర్చుంది. వారి వద్దకు ఇద్దరు మహిళా పోలీసులు వచ్చి... వారి ముందు నిలబడింది. వారిని ప్రశ్నించింది. ఈ సమయంలో యువకుడు ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశాడు. దానిని లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

ప్రేమికుల అడ్డా ప్రధానంగా పార్కులు. చాలా పార్కుల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతాయని వింటుంటాం. అయితే అందరు ప్రేమికులు కూడా అలా ఉండరు. కొందరు లవర్స్ కాలక్షేపం కోసం కూడా వెళ్తారు.

మంగళవారం తిరువనంతపురంలోని ఓ పబ్లిక్ పార్క్‌కు విష్ణు, ఆర్తి అనే ఓ ప్రేమజంట వెళ్లింది. వారిద్దరూ వెళ్లి ఓ దగ్గర కూర్చున్నారు. కాసేపటికి వారి దగ్గరకు ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు. పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పారు.

వెంటనే విష్ణు ఫేస్‌బుక్‌లో ఉన్న లైవ్ ఆప్షన్‌ను క్లిక్ చేశాడు. జరిగిన వ్యవహారాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. అంతేకాదు, మహిళా పోలీసులపై విష్ణు ప్రశ్నల వర్షం కురిపించాడు. పోలీస్ స్టేషన్‌కు ఎందుకు రావాలని ప్రశ్నించాడు.

పబ్లిక్ పార్కులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినందుకు మీ ఇద్దరినీ స్టేషన్‌కు తరలిస్తామని మహిళా పోలీసులు చెప్పారు. మీ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెబుతామన్నారు. అసలు మేం ఏం చేశామని అతను నిలదీశాడు.

ముద్దు పెట్టుకున్నామా, కౌగిలించుకున్నామా, పబ్లిక్‌తో అసభ్యంగా ప్రవర్తించామో చెప్పాలని అడిగాడు. ఇక్కడ కెమెరాలు ఉన్నాయని.. ఏం తప్పు చేశామో చూపించాలని నిలదీశాడు. పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేశారని, అందుకు రూ.200 జరిమానా కట్టాలని మహిళా పోలీసులు చెప్పారు.

అందుకు కూడా ఆ ప్రేమికులు అంగీకరించలేదు. తాము ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు జరిమానా కట్టమని తేల్చి చెప్పారు. పోలీసులు వాగ్వాదానికి దిగడంతో ఎట్టకేలకు ప్రేమజంట దిగొచ్చింది. ఫైన్ స్లిప్‌పై సంతకం చేసి, పోలీస్ జీప్ ఎక్కారు. జీప్‌లో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలో పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, చేయని తప్పుకు కూడా స్టేషన్‌కు రమ్మని పిలుస్తున్నారని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దిరోజుల్లో విష్ణుతో తనకు పెళ్లి జరగబోతోందని ఆర్తి చెప్పింది. దీనిపై పోలీస్ బాస్ స్పందించారు.

English summary
Kerala Police chief apologises after couple’s Facebook Live video of cops’ moral policing goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X