వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో బిజెపి: కిరణ్ బేడీకి రెండు వోటర్ ఐడి కార్డులు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ఉదయ్ పార్క్, తాల్ కటోరా లేన్ అడ్రసులతో రెండు వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి.

ఈ విషయమై పిటిఐ వార్తా సంస్థ కిరణ్ బేడీని ప్రశ్నించగా - మాట్లాడడానికి నిరాకరించారు. ఈ సమస్య గురించి తమకు తెలుసునని, తాల్ కటోరా లేన్ అడ్రసుతో ఉన్న మొదటి డాక్యుమెంట్‌ను తొలగించమని కోరుతూ ఆమె దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఒక తుది నిర్ణయానికి వస్తామని ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

Kiran Bedi has two voter ID cards, EC examining how they were issued

తన రెండు కార్డుల్లో ఒకదాన్ని రద్దు చేయాలని కోరుతూ కిరణ్ బేడీ దరఖాస్తు చేయకుండా ఉండి ఉంటే ఆమెపై చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం ఉందని ఆ అధికారి సూచనప్రాయంగా తెలియజేశారు. కిరణ్ బేడీకి జారీ అయిన రెండు కార్డుల్లో ఉదయ్ పార్కు చిరునామాతో ఉన్న కార్డుపై ‘టిజడ్‌డి 1656909' ఓటరు ఐడి నంబరు ఉంది. అలాగే నంబర్ 2, తాల్‌కటోరా లేన్ అడ్రసుతో ఉన్న మరో కార్డుపై ‘ఎస్‌జెఇ 0047969' నంబరు ఉంది. నామినేషన్ పత్రాల్లో కిరణ్ బేడీ తన నివాసం అడ్రసుగా ఉదయ్ పార్కును పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందనను కోరగా, ఓటర్ల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు ఒకటికన్నా ఎక్కువ ఎంట్రీలున్నాయని ఆరోపిస్తున్న బిజెపి తన వాస్తవాలను తనిఖీ చేసుకోలేదని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ‘ఈ సమస్యను పరిష్కరించాల్సింది ఎన్నికల కమిషన్. అయితే ఓటర్ల జాబితాలో ఆప్ కార్యకర్తలకు ఒకటికన్నా ఎక్కువ ఎంట్రీలున్నాయని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. వాళ్లు తమ వాస్తవాలను చెక్ చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది' అని ఆ పార్టీ ప్రతినిధి అన్నారు.

English summary
BJP's chief ministerial candidate Kiran Bedi is reported to have two voter identity cards having separate addresses. The Election Commission is now examining how she was issued two documents from different localities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X