వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్లక్ష్యంగా డ్రైవింగ్: 'అతి తక్కువ శిక్షలు, న్యాయవ్వవస్ధ అపహాస్యం పాలవుతోంది'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల కేసుల్లో అతి తక్కువ శిక్షలు విధిస్తున్నారని సుప్రీం కోర్టు మండిపడింది. దీని మూలంగా భారత న్యాయవ్వవస్ధ అపహాస్యం పాలవుతోందని పేర్కొంది. 2007లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీసిన కేసుని విచారించిన సుప్రీం కోర్టు పైవ్యాఖ్యలు చేసింది.

వెంటనే 304ఎ చట్టాన్ని పునరాలోచించాలని లా మేకర్స్‌కు సూచించింది. ఇటీవల కాలంలో వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం మూలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరగడాన్ని గమనించామని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని దీపక్ మిశ్రా, ప్రపుల్లా సీ పంత్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ పేర్కొంది.

Light sentences for negligent driving 'mockery of justice': SC to lawmakers

దేశంలోని పేదలు తమ ప్రాణాలకు రక్షణ లేదని భావిస్తున్నారని, పాదచారులు సైతం అయోమయ స్ధితిలో ఉండిపోతున్నారని బెంచ్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. నాగరీకులుగా చెప్పుకునే కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇతరులు బలై పోతున్నారని అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఉన్న ఈ శిక్షలు బాధితులు, వారికి సంబంధించిన ఎంతోమంది ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికైనా లా మేకర్స్ వీటిని పునఃసమీక్షించాలని తెలిపింది. ఐసీసీ సెక్షన్ 304ఎ ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి దారి తీసిన కేసుల్లో రెండు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

English summary
Terming light sentences being awarded in road accident cases as "mockery of justice", Supreme Court on Monday asked lawmakers to "scrutinise, re-look and re-visit" the penal laws saying the poor's life was as worth living as that of the rich.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X