వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో గందరగోళం: ఆరుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్

సభా కార్యకలాపాలకు విఘాతం కల్పిస్తున్నారన్న కారణంతో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గోసంర‌క్ష‌ణ పేరుతో జ‌రుగుతున్న దాడుల అంశంపై చ‌ర్చించాల‌ని లోక్‌స‌భ‌లో సోమవారం ప్ర‌తిప‌క్షాలు ఆందోళనకు దిగాయి. మొద‌ట ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఈ అంశాన్ని చ‌ర్చించాల‌ని కాంగ్రెస్‌తో పాటు ఇత‌ర పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే జీరో అవ‌ర్‌లో ఈ అంశాన్ని చ‌ర్చిద్దామ‌ని స్పీక‌ర్ సుమ్రితా మ‌హాజ‌న్ అన్నారు.

అయినా, ప్రతిపక్షాలు శాంతించలేదు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయి. అయితే బీజేపీ సభ్యులు మాత్రం బోఫోర్స్‌ కుంభకోణంపై చర్చించాలని నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంయమనం పాటించాలని సభ్యులను స్పీకర్‌ కోరినా వారు వినిపించుకోలేదు.

Lok Sabha Speaker Sumitra Mahajan suspends six Congress MPs

అంతేగాకుండా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌పై కాంగ్రెస్ సభ్యులు కాగితాలు చించి విసరేశారు. దీంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. సభా కార్యకలాపాలకు విఘాతం కల్పిస్తున్నారన్న కారణంతో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సస్పెండ్‌ చేశారు. ఆరుగురిని 5రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన వారిలో ఆధిర్‌ రంజన్‌ ఛౌదురి, రంజీత్‌ రంజన్‌, సుస్మిత దేవ్‌, గౌరవ్‌ గగోయ్‌, కె.సురేష్‌, ఎంకే రాఘవన్‌లు ఉన్నారు.

English summary
Lok Sabha Speaker Sumitra Mahajan on Monday suspended Congress MPs Gaurav Gogoi, Sushmita Dev, Ranjeet Ranjan, Adhir Choudhary, K Suresh and M K Raghavan for five days for disrupting the proceedings of the House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X