వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఏటీఎంలలో డబ్బులున్నాయ్.. కానీ జనమే లేరు!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఏటీఎంలలో డబ్బులు ఉన్నప్పటికీ అక్కడ భారీ క్యూలు మాత్రం దర్శనమివ్వడం లేదు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు నగదు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామునే బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. తమ అవసరాల మేరకు డబ్బులు రావడం లేదంటూ ఆందోళనలు కూడా చేస్తున్నారు. కానీ, ఒక్క రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఆందోళనలు లేవు. అంతేగాక, ఏటీఎంలలో డబ్బులున్నప్పటికీ.. భారీ క్యూలు కూడా దర్శనమివ్వడం లేదు. ఇదంతా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి.

అయితే, నోట్ల రద్దు తరువాత ఇక్కడ మొదటి రెండు రోజులు మాత్రం ఏటీఎంల వద్ద జనం కాస్త బారులు తీరినట్లు కనిపించారు. ఆ తర్వాత ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని సోపోర్‌లోని జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ ఇజాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. కాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మూలంగా ప్రజల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే దీనికి కారణమని ఆయన తెలిపారు.

Long ATM queues not for them: ‘Moneyless’ Kashmir calm over note ban

జులైలో హిజ్బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ అనంతరం అక్కడ ఎక్కువగా కర్ఫ్యూ నీడలోనే గడిచింది. ఈ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితమైపోయారు. వారు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం మాట అటుంచితే.. సేవ్‌ చేసుకున్న అంతో ఇంతో డబ్బు కూడా ఖర్చయిపోయింది.

అందువల్లే ఏటీఎంల వద్ద దేశంలోని మిగతా ప్రాంతాల్లా కాకుండా ఇక్కడ క్యూలలో జనం తక్కువగా ఉన్నారని ఈ పరిస్థితులను విశ్లేషిస్తూ కాశ్మీర్‌ యూనివర్సిటీ బిజినెస్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ సంగ్మీ వెల్లడించారు. కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తగా నిత్యావసరాలను పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకోవడం కూడా వారికి ఏటీఎంలతో పనిలేకుండా చేసిందని ఆయన వివరించారు.

English summary
Consider visiting Kashmir if you are desperate for cash. The ATMs here have currency and the queues at most places are no more than 4-5 people long.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X