వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఆకస్మిక పాక్ పర్యటన: ట్వీట్‌తో సంచలనం

By Pratap
|
Google Oneindia TeluguNews

కాబూల్: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చేరుకున్నారు. ఆప్గనిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌‌కు వచ్చిన ప్రధాని మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ ఘన స్వాగతం పలికారు. పాకిస్థాన్‌లో ప్రధాని మోడీ 2 గంటల పాటు ఉంటారు.

లాహోర్ ఎయిర్‌పోర్టులో భారత్, పాకిస్థాన్ ప్రధానులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 5.15కు భారత్‌కు తిరుగు పయనమవుతారు. ప్రధాని అయ్యాక ప్రధాని నరేంద్రమోడీ తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు.

'Looking forward to meeting Nawaz Sharif in Lahore today', says Modi

అయితే, రష్యా, ఆఫ్గనిస్థాన్ పర్యటన అనంతరం తొలిసారిగా పాకిస్థాన్‌లో కాలుమోపిన మోడీకి సత్కారాలేవీ ఎదురుకాలేదు. కేవలం కొద్ది గంటల ముందు మాత్రమే తాము పాక్ గడ్డపై కాలు మోపనున్నానని, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయనున్నానని ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, మోడీకి స్వాగతం పలికేందుకు నవాజ్ షరీఫ్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో పుట్టిన రోజు శుభాభినందనలు, ఆపై ఇరు దేశాల ప్రధానుల మధ్య కాసేపు మాటా మంతీ ఎయిర్ పోర్టు లాబీల్లోనే జరిగిపోయాయి. అందువల్లే సైనిక లాంఛనాలు అందుకోకుండానే మోడీ తిరిగి రానున్నారని తెలుస్తోంది.

తమ ఆతిథ్యం స్వీకరించాలని షరీఫ్ కోరినప్పటికీ, మరోసారి వస్తానని మోడీ వెల్లడించినట్టు సమాచారం. భారత్, పాక్ దేశాల మధ్య ఈ ఘటన చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ఫ్లాష్ న్యూస్ లు ఇస్తున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోడీ వేసిన అడుగు రెండు దేశాల మైత్రికి శుభ సంకేతమని యూరప్, యూఎస్ పత్రికల వెబ్ సైట్లలో ప్రత్యేక వార్తలను రాశాయి. షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌లో మోడీ పర్యటన లేదు. దీంతో మోడీ పాక్‌ పర్యటనకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్‌లో ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ పర్యటనలో ఉన్న మోడీ అక్కడి నుంచి నేరుగా లాహోర్‌ చేరుకున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారిగా సంచలనం సృష్టించింది.

పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పుట్టినరోజు మోడీ శుభాకాంక్షలు తెలిపి ఆయనతో పలు అంశాలపై చర్చిస్తారు. పాకిస్తాన్ పర్యటన వివరాలను మోడీ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మోడీ పాకిస్తాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

అదే విధంగా ఆకస్మికంగా పాకిస్తాన్‌లో పర్యటించనున్న భారత ప్రధాని కూడా మోడీనే. తాను నవాజ్ షరీఫ్‌తో మాట్లాడానని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపానని కూడా మోడీ ట్వీట్ చేశారు. ఢిల్లీకి తిరిగి వచ్చే మార్గమధ్యలో షరీఫ్‌ను కలుస్తున్నట్లు తెలిపారు.

English summary
In a major surprise, Prime Minister Narendra Modi will be flying to Lahore this afternoon, his first touchdown in Pakistan, where he will meet his counterpart Nawaz Sharif.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X