వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీపికబురే:సామాన్యులకు బడ్జెట్ లో రాయితీలివ్వనున్న కేంద్రం

పెద్ద నగదు నోట్ల రద్దుతో కేంద్రం సామాన్యులపై వరాలు కురిపించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను పరిమితిని పెంచడంతో పాటు ఇతర రాయితీలను ఇవ్వనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పెద్ద నగదు నోట్ల రద్దుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిన కేంద్రప్రభుత్వం ప్రజలపై తక్కువ పన్నులను వేసేందుకు ప్రయత్నిస్తోంది.ఈ బడ్జెట్ లో సామాన్యులపై పన్నుల ప్రతిపాదనను విరమించుకోనుంది.

పెద్ద నగదు నోట్ల రద్దుపై సామాన్యులు ఇబ్బందులు పడ్డారు.అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకుగాను ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ లో తక్కువ పన్నులను ప్రజలపై వేయాలని సర్కార్ భావిస్తోంది.ఈ మేరకు కేంద్రం కసరత్తుచేస్తోంది.

ఈ బడ్జెట్ పై పలు వర్గాల నుండి పలు రకాల ఆశలను పెట్టుకొన్నారు.ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సహం ఉంటుందని భావిస్తున్నారు.

పన్నుల ప్రతిపాదనను విరమించుకోనున్న కేంద్రం

పన్నుల ప్రతిపాదనను విరమించుకోనున్న కేంద్రం

ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.2017 బడ్జెట్ లో సామాన్యులకు కొన్ని రాయితీలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.తక్కువ పన్నులు, ఆదాయ పన్ను మినహయింపు పరిమితి రెట్టింపు తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. వినిమయశక్తి దారుణంగా పడిపోయిందన్న నివేదికల ఆదారంగా వినియోగదారుల కొనుగోళ్ళకు శక్తిని ఇచ్చేందుకుగాను బడ్జెట్ లో ప్రతిపాదనలను చేయనున్నారు.

రియల్ ఏస్టేట్ తోపాటు ఇతర రంగాలకు ఊతమిచ్చేలా నిర్ణయాలు

రియల్ ఏస్టేట్ తోపాటు ఇతర రంగాలకు ఊతమిచ్చేలా నిర్ణయాలు

ఇన్ ఫ్రా, హౌజింగ్, పట్టణాభివృద్ది వంటి రంగాలకు కొత్త పెట్టుబడులు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థకు కొత్త పెట్టుబడులను ప్రకటించే అవకాశం ఉంది.రానున్న కాలంలో ఆర్థిక వృద్దిై నెలకొన్న సందేహల నేపథ్యంలో ప్రభుత్వ విశ్వసనీయత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

 వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిపెంచే యోచన

వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిపెంచే యోచన

వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ లేదా రేటును తగ్గించే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటుగా ఆదాయపు పన్ను మినహయింపును రెట్టింపు చేసే అవకాశం ఉందన్నారు.ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి ఏడాదికిఒకటిన్నర లక్షల నుండి రెండు లక్షలకు పెంచే అవకాశం ఉంది.అదే విధంగా సెక్షన్ 80 సి ప్రకారం ఉన్న పరిమితిని ఒకటిన్నరలక్షల నుండి రెండు లక్షలకు గృహ రుణ పరిమితిని రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచే అవకాశం ఉంది. పన్ను మినహయింపు కోసం పిక్స్ డ్ డిపాజిట్లను లాకిన్ పీరియడ్ ను ఐదేళ్ళ నుండి మూడేళ్ళకు తగ్గించే అవకాశం ఉంది.

కేంద్ర బడ్జెట్ లో ఒక మోస్తర్ పన్ను రేట్లను విస్తృత ఆధారిత పన్ను వ్యవస్థను రాబోయే ఒకటి రెండు ఏళ్ళకు అంచనా వేస్తున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నికర ప్రత్యక్ష పన్నలు వసూళ్ళు 2016 నవంబర్ నాటికి 26.2 శాతం భారీ పెరిగింది .కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీసు పన్నుల నికర ఆదాయం గత ఏడాది ఏప్రిల్ ..డిసెంబర్ లో 25 శాతం పెరిగింది.

సామాన్యులపై వరాలు కురిపించనున్న కేంద్రం

సామాన్యులపై వరాలు కురిపించనున్న కేంద్రం

సామాన్యులకు ఉపశమనం కలిగించేలా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వంపై ఏటా అదనంగా 35,300 కోట్లు ఖర్చు అవుతోందని ఎస్ బి ఐ గుర్తింపు పొందిన ఆర్థిక పరిశోదన శాఖ అంచనా వేసింది. ఆదాయపన్ను పథకం వెల్లడి ద్వారా వచ్చే సొమ్ముతో ఇది సరిపోతోంది.నోట్లపై ఆర్ బి ఐ భారాన్ని తగ్గించడం ద్వారా దీనిని అమల్లోకి తెస్తారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకొంటోంది

ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకొంటోంది

అదనంగా ప్రభుత్వంపై మోపే భారాన్ని తగ్గించుకొనేందుకుగాను ఇతర మార్గాలను సర్కార్ అన్వేషిస్తోంది. ఐడిఎస్ పథకం ద్వారా 50 వేల కోట్లు, ఆర్ బి ఐ పై నోట్ల భారాన్ని తగ్గించడం ద్వారా 75 వేల కోట్లు సమకూరుతాయని ఎస్ బి ఐ పరిశోదన సంస్థ అంచనావేసింది.పెద్ద నగదు నోట్ల రద్దు ద్వారా ప్రత్యక్ష పన్నుల పునర్వవ్యవస్థీకరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయంతో ఉంది.

English summary
narendra Modi. faced with a slump in demand after his shock clampdown on cash, he's expected to lower taxes in the Feb. 1 budget to spur consumption. the risk is that a cut will rob PM Modi of a short-term revenue spurt, which his administration had been touting as proof of success of the currency policy change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X