వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: ఊర కుక్క దాడిలో కాలు కోల్పోయిన గర్భవతి

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బరేలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కుక్క బెడద తీవ్రంగా ఉంది. తాజాగా, ఓ ఊర కుక్క దాడిలో గర్భవతి అయిన మహిళ తన కాలిని కోల్పోయింది. మహిళ కేకలు ఉన్న గ్రామస్థులు వెదురుబొంగులతో కుక్కలను తరిమి, మహిళను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆమె ఓ కాలును కోల్పోయింది. బాధితురాలిని లలితగా గుర్తించారు.

గత నెల రోజుల వ్యవధిలో కుక్కలు ఐదుగురు పిల్లలను చంపేశాయి. పది మందిని గాయపరిచాయి. ఓ ఊర కుక్క ఎనిమిదేళ్ల బాలికపై ఆదివారం అమ్రోహాలోని హసన్పూర్ తెహిసీల్‌లో దాడి చేసి, ఆమెను చంపేసింది. ఊర కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లలను, మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ మేరకు ఓ ఆంగ్లదినపత్రికలో వార్తాకథనం అచ్చయింది.

Lucknow: Pregnant woman loses leg in dog attack

వాటి మెడలకు తాడు లేదా కాలర్ వేయాలని ప్రస్తుతం అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే హోలీ తర్వాతనే ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు. కుక్కలు హింసాత్మకంగా మారడానికి ఆ ప్రాంతంలో ఎక్కువ పశువుల వధకు సంబంధించిన కర్మాగారాలు ఉండడమేనని అంటున్నారు.

దుకాణాల్లో ఇక్కడ పెద్ద యెత్తున బిర్యానీ విక్రయిస్తున్నారు. మిగిలిన బిర్యానీని కుక్కలకు వదిలేస్తారు. దాంతో అవి మాంసం తినడానికి మరిగాయి. తమకు సరైన ఆహారం లభించనప్పుడు అవి పిల్లలపై దాడులకు ఎగబడుతున్నాయి.

English summary
The stray dog menace in Bareilly district is increasing by the day and the latest victim is a pregnant woman who was attacked by dogs in a field. The villagers, on hearing her scream rushed to save her and chased away the dogs with bamboo sticks but the victim, Lalita, had already lost one leg in the incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X