వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీసీఎస్ మూసివేతను నిరసిస్తూ

లక్నోలోని టీసీఎష్ ఆఫీసు మూసివేతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో ఆఫీసు మూసివేతను నిరసిస్తూ ఆ కంపెనీ ఉద్యోగులు ఆందఓలనకు దిగారు. వారికి మద్దతుగా లక్నోప్రాంత ప్రజలు, టిసిఎస్ ఉద్యోగుల కుటుంబసభ్యులు రివర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:లక్నోలోని టీసీఎష్ ఆఫీసు మూసివేతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. లక్నో ఆఫీసు మూసివేతను నిరసిస్తూ ఆ కంపెనీ ఉద్యోగులు ఆందఓలనకు దిగారు. వారికి మద్దతుగా లక్నోప్రాంత ప్రజలు, టిసిఎస్ ఉద్యోగుల కుటుంబసభ్యులు రివర్‌ఫోర్ట్ వద్ద మార్చ్ నిర్వహించారు.

సేవ్ టీసీఎస్ అనే ప్లకార్డులతో చిన్న పిల్లలు, పెద్దలు, యువత అందరూ ఈ మార్చ్‌లో పాలుపంచుకొన్నారు. రెండువేలమందికి పైగా ఉన్న ఉద్యోగులను ఇతర సెంటర్లకు తరలించడంతో ఐటీ సెక్టార్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కూడ నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Lucknowites extend support to TCS staff

గత 33 ఏళ్ళుగా కంపెనీకి లక్నో సేవ చేస్తున్న విషయాన్ని స్థానికులు చెప్పారు. ఈ కార్యాలయాన్ని మూసివేసి , వేరే ప్రాంతాలకు ఉద్యోగులను తరలించడం సరైంది కాదన్నారు. లక్నో ఐటీ హబ్‌లోకి మారిన క్రమంలో ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్తోందన్నారు.

ఒక్కసారి టీసీఎస్ లక్నో నుండి వెళ్ళిపోతే మిగిలిన కంపెనీలు కూడ లక్నోలో కొత్తగా కార్యాలయాలను ఏర్పాటుచేసేందుకు వెనుకంజవేస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

లక్నో నియోజకవర్గం నుండి రాజ్‌నాథ్‌సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ విషయమై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ ఓ రిపోర్ట్‌ను కోరినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కూడ లక్నో నుండి టీసీఎస్‌ను తరలించకుండా అడ్డుకొంటామని ప్రకటించింది.

English summary
Lucknowites have openly come out in support of TCS employees who are being shifted to Noida and other centres from the Lucknow office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X