వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వారసుడు ఎవరంటే ? కరుణానిధి చెప్పేశారు

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తే అవకాశం ఎదురైయ్యింది. తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని డీఎంకే అధినేత కరుణానిధి (93) కుండలు బద్దలు కొట్టి చెప్పడంతో ఆయన పెద్ద కుమారుడు అళగిరి రగిలిపోతున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధి గురువారం ఓ ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. పార్టీ పటిష్టత కోసం స్టాలిన్ చాల కష్టపడ్డాడని కితాబు ఇచ్చారు. అందుకే తనకు ఎదైనా జరిగితే ముఖ్యమంత్రి స్థానంలో రాజకీయ వారుసుడిగా స్టాలిన్ ఉంటారని ప్రకటిస్తున్నానని కరుణానిధి అన్నారు.

M.K.Stalin

ఇప్పటికే చెన్నై రాజకీయాలకు దూరంగా ఉంటున్న కరుణానిధి పెద్దకు మారుడు అళగిరి మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడు రాజకీయాలు చూసుకుంటున్నారు. దక్షిణ మధురైలో అళగిరికి పార్టీ మీద పట్టు ఉంది.

పెద్ద కుమారుడు ఎక్కడ గొడవ చేస్తాడో అంటూ ఇంత కాలం వేచి ఉన్న కరుణానిధి చివరికి తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడు అళగిరి ఎక్కడ వచ్చి గొడవ చేస్తారో అని డీఎంకే నాయకులు హడలిపోతున్నారు. ఇంత కాలానికైనా పెద్దాయన ధైర్యం చేశారని స్టాలిన్ వర్గీయులు అంటున్నారు. అయితే అళగిరి, ఆయన వర్గీయుల మాత్రం ఈ ప్రకటనతో రగిలిపోతున్నారు.

English summary
Karunanidhi said that his son Stalin can only become the Chief Minister of Tamil Nadu if something happens to me.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X