నటి లైంగిక దాడి కేసు: జైల్లో మలయాళం హీరో లగ్జరీ లైఫ్, సెల్ లో లేడంట, అధికారులతో !

Posted By:
Subscribe to Oneindia Telugu

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ ఆలువ సబ్ జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడని మలయాళం మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఆలువ సబ్ జైల్ లో దిలీప్ తో పాటు ఉంటున్న సాటి ఖైదీ ఈ వివరాలు చెప్పాడని మీడియా కథనం ప్రసారం చేస్తున్నది.

ఆలువ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దిలీప్ కు ఓ గది కేటాయించారు. ఆ గదిలో దిలీప్ తో పాటు మరో ఖైదీ కూడా ఉన్నాడు. అయితే దిలీప్ సెల్ లో మాత్రం ఉడటంలేదని, జైళ్ల శాఖ అధికారులకు విధుల కోసం కేటాయించే గదుల్లో కాలం గడుపుతున్నాడని తెలిసింది.

Malayalam actor Dileep is living a luxury life in Aluva prison.

దిలీప్ తన పలుకుబడి ఉపయోగించి బయట నుంచి భోజనం తెప్పించుకుంటున్నాడని, నిత్యం జైళ్ల శాఖ అధికారులు కేటాయించిన గదుల్లో తిరుగుతూ టీవీ చూస్తూ కాలం గడపుతున్నాడని, రాత్రి పూట అక్కడే నిద్రపోతున్నాడని, ఖైదీలు వేసుకునే దుస్తులు వేసుకోవడం లేదని ఆలువ జైల్లోని కొందరు ఖైదీలు ఆరోపిస్తున్నారని వెలుగు చూసింది.

విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీజీపీ ఆలువ సబ్ జైలు చేరుకుని పరిశీలించారు. దిలీప్ సాదారణ ఖైదీలాగే ఉన్నారని, ఆయనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద మలయాళం హీరో దిలీప్ తన పలుకుబడితో జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడని తెలిసింది.

Man held for raping and impregnating Madhapur teenage girl

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to reports, Malayalam actor Dileep is living a luxury life in Aluva prison.
Please Wait while comments are loading...