వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులో 2గం.లు వేధింపు, వీడియోలు: సీఎం స్పందన, కుట్ర కోణమా?

నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు సునీల్‌ కుమార్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: హీరోయిన్ అపహరణ, లైంగిక వేధింపుల కేసులో పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు సునీల్‌ కుమార్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

అనంతరం మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. నటి శుక్రవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో కేరళలోని ఎర్నాకుళంలో సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు దుండగులు ఆమె కారు ఆపి కారులోకి చొరబడ్డారు.

రెండు గంటల పాటు భావనకు వేధింపు

రెండు గంటల పాటు భావనకు వేధింపు

దాదాపు రెండు గంటల పాటు ఆమెను లైంగికంగా వేధించారు. ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం కారు నుంచి దిగి మరో కారులో పరారయ్యారు. దీంతో ఆమె శుక్రవారం రాత్రి నెడుంబస్సెరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి స్పందన

ముఖ్యమంత్రి స్పందన

తన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తామని వారు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హీరోయిన్‌ను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం హామీ ఇచ్చారు.

కేసుపై ఆదేశాలు

కేసుపై ఆదేశాలు

కాగా, నటి హీరోయిన్‌ను కిడ్నాప్ చేసి, వేధింపులకు గురి చేసిన ఘటనను కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వదిలిపెట్టమని ప్రభుత్వం కూడా చెప్పింది. కేసును త్వరితగతిన విచారించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

డీజీపీ ప్రకటన

డీజీపీ ప్రకటన

కేరళ అడిషనల్ డీజీపీ సంధ్య మీడియాతో మాట్లాడారు. ప్రధాన నిందితుడు సునీల్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. కేసు దర్యాఫ్తులో పురోగతి సాధించామన్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

కుట్ర దాగి ఉందా?

కుట్ర దాగి ఉందా?

ఇదిలా ఉండగా, హీరోయిన్‌ను కిడ్నాప్ చేసి, రెండు గంటల పాటు కారులో వేధించడం, కారులో ఫోటోలు, వీడియోలు తీయడం పైన కుట్ర కోణం అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోనే కొందరు ఆమె పైన కుట్ర చేసి ఉండవచ్చునని అంటున్నారు.

English summary
Malayalam actress' former driver and team kidnaps her for a few hours at night, police arrests the culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X