వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్రంలో 2 వేల మంది గూండాలు.. అందరినీ అరెస్టు చేయమన్న సీఎం

సినీనటి కిడ్నాప్, లైంగిక వేధింపుల వార్తల నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ అరెస్టు చేయమంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ అరెస్టు చేయమంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఓ సినీనటి కిడ్నాప్, లైంగిక వేధింపుల వార్తల నేపథ్యంలో సీఎం ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కేరళ రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆ రాష్ట్రంలో మొత్తం 2010 మంది గూండాలు ఉన్నారు. మొత్తం 14 జిల్లాల్లో వీళ్లందరిపై కేసులు నమోదై ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఎర్నాకుళంలో ఓ సినీనటి విషయంలో జరిగిన ఘటన రాష్ట్రాన్ని వేడెక్కించింది.

ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర హోంశాఖ పోర్టుఫోలియో కూడా సీఎం విజయన్ దగ్గరే ఉంది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Malayalam actress molestation: CM Pinarayi Vijayan orders arrest of 2,010 goons in 30 days

రాష్ట్రంలోని సంఘ విద్రోహ శక్తులను కఠిన చట్టాల కింద అరెస్టు చేయాలని, ఇప్పటికైనా హోం శాఖను సీఎం ఇతరులకు అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం విజయన్ కూడా తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల సమయం ఇస్తున్నానని, రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ అరెస్టు చేయాలంటూ తాజాగా పోలీసు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

English summary
Molestation incident with the well-known Malayalam actress Bhavana has raised many brows in past few days and among them is Kerala’s Chief Minister Pinarayi Vijayan. On February 20, CM Vijayan ordered the state’s 14 District Collectors to ensure the arrest of 2,010 goons listed by the intelligence wing in 30 days time. The Chief Minister of the State has faced criticism from the opposition on the deteriorating law and order situation after the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X