చెల్లి భర్తతో అక్రమ సంబంధం: తమ్ముడితో సమానం, వినలేదు, భార్యను లేపేశాడు, చివరికి !
తన సొంత చెల్లి భర్తతో భార్య (వరుసకు సోదరుడు) అక్రమ సంబంధం సాగిస్తోందని సహించలేని భర్త ఆమెను అతిదారుణంగా హత్య చేశాడు. వారితో పాటు ఇంటిలో ఉంటున్న సోదరి కుమారుడిని చంపేసి తరువాత అతను ఆత్మహత్య చేసుకున్న ఘ
నాసిక్: తన సొంత చెల్లి భర్తతో భార్య (వరుసకు సోదరుడు) అక్రమ సంబంధం సాగిస్తోందని సహించలేని భర్త ఆమెను అతిదారుణంగా హత్య చేశాడు. వారితో పాటు ఇంటిలో ఉంటున్న సోదరి కుమారుడిని చంపేసి తరువాత అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన నాసిక్ లో జరిగింది.
భార్య పుట్టింటిలో, కసితో కన్న కూతురిని రేప్ చేశాడు, కొడుకుకు తెలిసింది, అంతే ఇంటిలో !
నాసిక్ లోని బసవంత్ టౌన్ లో రవీంద్ర నగ్మల్, సురేఖ (32) దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు రవీంద్ర సోదరి కుమారుడు విశాల్ (10) అక్కడే నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. రవీంద్ర సోదరి భర్తతో సురేఖ అక్రమ సంబంధం సాగిస్తోంది.
బెడ్ రూంలో భార్య, చెల్లి భర్త
విశాల్ ను చూసి వెళ్లడానానికి వస్తున్న వరుసకు సోదరుడైన వ్యక్తితో సురేఖ బెడ్ రూంలో ఉన్న విషయాన్ని రవీంద్ర చూశాడు. తరువాత నీ పద్దతి మార్చుకోవాలని భార్య సురేఖకు హెచ్చరించాడు. అయితే సురేఖ పద్దతి మాత్రం మార్చుకోలేదు.
పరువు పోతోందని
అందరికి తెలిస్తే పరువు పోతుందని ఆందోళన చెందిన రవీంద్ర భార్య సురేఖను హత్య చెయ్యాలని నిర్ణయించాడు. ఆదివారం భార్య సురేఖతో గొడవ పెట్టుకున్నన రవీంద్ర ఆవేశంలో చంపేశాడు. అడ్డు వచ్చిన చెల్లి కుమారుడు విశాల్ ను హత్య చేశాడు.
చివరికి ఆత్మహత్య
తరువాత మరో గదిలోకి వెళ్లిన రవీంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి వరకూ ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రాలేదు. ఇంటి యజమానికి అనుమానం వచ్చి వెళ్లి చూడగా రవీంద్ర ఫ్యాన్ కు వేలాడుతున్న విషయం వెలుగు చూసింది.
సోదరిడితో అక్రమ సంబంధం !
ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవీంద్ర భార్య, మేనల్లుడిని హత్య చేసిన తరువాత రవీంద్ర సూసైడ్ నోట్ రాసి పెట్టాడని పోలీసు అధికారులు చెప్పారు.
అందుకే చంపేశా !
తన సొంత చెల్లి భర్తతో నా భార్య సురేఖ అక్రమ సంబంధం సాగిస్తోందని, అందుకే చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని రవీంద్ డెత్ నోట్ లో వివరించాడని పోలీసులు అన్నారు. అయితే మేనల్లుడు విశాల్ ను ఎందుకు హత్య చేశాడు అనే విషయంపై విచారణ మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు.