వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామా బిన్ లాడెన్‌కు ఆధార్ కార్డు తయారు చేశాడు: అరెస్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా భద్రతాదళాలు జరిపిన దాడుల్లో హతమైన ఆల్‌ఖైదా ఉగ్ర నేత ఒసామా బిన్ లాడెన్ పేరుతో ఆధార్ కార్డును తయారు చేస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆపరేటర్ సద్దాం మన్సూరి(35)ని అదుపులోకి తీసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని భిల్వారా నగరంలో ని మండల్‌లో ఓ ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్ నడుపుతున్నాడు.

కాగా, ఇతడు ఉగ్రవాది బిన్ లాడెన్ పేరు మీద ఆధార్ కార్డును తయారు చేసేందుకు ప్రయత్నించాడు. అబ్బొట్టాబాద్ జిల్లా బిల్వారా అని లాడెన్ చిరునామాను అప్‌లోడ్ చేశాడు. అంతేగాక, ఓ ఉగ్రవాది ఫొటోను స్పష్టంగా కనిపించకుండా చేసి అప్‌లోడ్ చేశాడు. కానీ, చేతి వేలిముద్ర, ఐటెంటిటీ ప్రూఫ్, ఇతర వివరాలను నమోదు చేయలేదు.

Man tries to get Aadhaar card for Osama bin Laden, booked

అయితే, ఈ డేటా బేస్‌ను పరిశీలించిన ధృవీకరణ శాఖ అధికారులు తప్పులు జరిగినట్లు గుర్తించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మండల్ డీఎస్పీ చంచల్ మిశ్రా మీడియాకు తెలిపారు. ఐటీ శాఖ కూడా సద్దాం ఇలా నకిలీ ఆధార్ కార్డులు ఎలా తయారు చేశాడు?, ఎన్ని తయారు చేశాడనేదానిపై దృష్టి సారించింది.

English summary
Saddam Mansuri, a 35-year old Unique Identification Authority of India (UIDAI) operator was reportedly caught by officials trying to make an Aadhaar card using the name of slain al Qaeda terrorist Osama Bin Laden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X