వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీ పార్టీ కంటే బెట్టర్‌గా: మాంఝీ కొత్త పార్టీ! నితీష్‌పై సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయు నుండి సస్పెండైన నేత జీతన్ రామ్ మాంఝీ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. మాంఝీ ఏఏపీ సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అనుసరించేలా కనిపిస్తున్నారు. మాంఝీ మద్దతుదారులు హిందూస్తాన్ అవామీ మోర్చా పేరుతో ఓ ఫ్రంట్‌ను స్థాపించారు.

ఈ సందర్భంగా మాంఝీ మాట్లాడారు. తాము ప్రస్తుతం హిందూస్తాన్ అవామీ మోర్చాను ప్రారంభించామని, ఇది అందరినీ కలుపుకొని వెళ్తుందని చెప్పారు. ఇది ఏఏపీ కంటే ఉన్నతంగా ఉంటుందని చెప్పారు. బీహార్‌లో ప్రజా ఉద్యమం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే హిందుస్తాన్ అవామీ మోర్చా అనే ఫ్రంట్ తీసుకు వచ్చినట్లు చెప్పారు.

Manjhi may float a new party, says it will be better than AAP

మరోవైపు, జీతన్ రామ్ మాంఝీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల వివక్ష చూపించి తనను నితీష్ అవమానించారన్నారు.

తాను రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో కడిగించారని ధ్వజమెత్తారు. బీహార్‌లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుతం తన పరిస్థితికి జేడీయులోని అగ్రకుల నాయకులే కారణమన్నారు. తాను దళితుడిని కాబట్టి అన్యాయం జరిగిందన్నారు.

English summary
Asking youths and common people to join politics and social service, former Bihar chief minister Jitan Ram Manjhi and his supporters today floated 'Hindustani Awam Morcha' (HAM), a front to work for the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X