చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపోలోలో జయలలిత: వారికి రూ.8 కోట్ల బిజినెస్

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా రావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు చేపట్టిన ప్రత్యే కపూజలతో ఒక్కసారిగా మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. కుంభకోణం, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా కుండలను తెస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.8 కోట్లకు పైగా వ్యాపారాలు జరిగినట్టు తెలుస్తోంది. జయలలిత అనారోగ్యంతో గత నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జయ త్వరగా కోలుకోవాలని కోరుతూ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

jayalalithaa

పూజల్లో భాగంగా పాలబిందెలతో ఊరేగింపులు జరిపి స్వామివార్లకు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. ఆయా నాయకుల పదవులను బట్టి 108, 508, 1008 పాలబిందెలను కొనుగోలు చేస్తున్నారు. మంత్రులు, జిల్లా కార్యదర్శులైతే 5,0008 నుంచి 7,0000 వరకు పాలబిందెలతో ఊరేగింపులు చేస్తున్నారు. దీంతో పాల బిందెలకు డిమాండ్‌ పెరిగింది.

ఈ విషయమై రాష్ట్ర పాత్రల దుకాణం వ్యాపారుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ రాఘవన్ మాట్లాడారు. జయ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థిస్తూ పాలబిందెల ఊరేగింపు, అభిషేకాలు జరుపుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగిందన్నారు.

జిల్లాకు చెందిన ఓ మంత్రి 5 వేల బిందెలు కావాలని కోరగా, ఆ సమయంలో తమ వద్ద 3 వేలు మాత్రమే ఉన్నాయని, వెంటనే తాము కుంభకోణం నుంచి అత్యవసరంగా 2 వేల బిందెలను తెప్పించామన్నారు.

సాధారణంగా వీటి వాడకం తక్కువగా ఉండడంతో కేవలం ఆడి మాసం సందర్భంగా అధికంగా ఉత్పత్తి చేసేవారమన్నారు. కానీ, ఆకస్మాత్తుగా వీటికి డిమాండ్‌ ఏర్పడడంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తి చేయలేని పరిస్ధితి నెలకొనిందన్నారు. కాగా, అపోలో ఆసుపత్రి వద్ద కూడా దుకాణాలకు గిరాగీ పెరిగిన విషయం తెలిసిందే.

English summary
Milk pot procession for speedy recovery of Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X