వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిని బహిష్కరించారు: కుమార్తె వివాహం ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

ఒడిశా: అగ్రకులానికి చెందిన వ్యక్తితో కుమార్తె వివాహం జరిపించిన మంత్రిని కుల పెద్దలు ఊరి నుంచి బహిష్కరించారు.ఆయనకు అండగా నిలిచిన వారిని సైతం వెలేశారు, సాక్షాత్తు ఓ మంత్రిని ఊరి నుంచి, కులం నుంచి వెలివేశారని వెలుగు చూడటంతో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.

ఒడిశా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, అభివృద్ది, క్రీడలు, యూత్ సర్వీస్ శాఖ మంత్రి సుదమ్ మురాండీ సంతాల్ గిరిజన తెగకు చెందిన వారు. ఈయన కుమార్తె సంజీవిని, బిజూ జనతాదళ్ స్టూడెంట్ నాయకుడు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సునీల్ సరంగి ప్రేమించుకున్నారు.

MInister’s daughter marries Brahmin and now he faces a boycott from his Tribe

2016 జనవరి 31వ తేదిన మంత్రి సుదమ్ భువనేశ్వర్ లో కుమార్తె సంజీవిని, సునీల్ సరంగికి వైభవంగా వివాహం జరిపించాడు. ఈ వివాహ వేడుకులకు గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు అతిరథ మహారథులందరూ హాజరైనారు. మంత్రి తన కుమార్తెకు కులాంతర వివాహం జరిపించారని కుల పెద్దలు తెలుసుకున్నారు.

శుక్రవారం పట్టణంలో కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. సంతాల్ తెగ (గిరిజన) లో కులాంతార వివాహాలకు తావులేదని కుల పెద్దలు తేల్చి చెప్పారు. మంత్రి సుదమ్ నియమాలు ఉల్లంచినందు వలన ఆయనను కులం నుంచి, ఊరి నుంచి బహష్కరించారు.

English summary
Minister of State for ST and SC Development, Sports and Youth Services Sudam Marandi belongs to the Santhal tribe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X