వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడర్న్ ట్రాజెడీ: నేపాల్లో నవ్వుతూ సెల్ఫీలు!, తిండిలేక ఇబ్బంది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: నేపాల్‌లో ఘోర భూకంపం నేపథ్యంలో చారిత్రక తొమ్మిది అంతస్తుల ధరహార స్థూపం కూలిపోయిన విషయం తెలిసిందే. ధరహార స్థూపం కూలి పలువురు మృతి చెందారు. నేపాల్లో మూడువేలకు పైగా భూకంపం వల్ల మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు కొంతమంది యువత వాటిని ఫోటోలు తీసు సామాజిక అనుసంధాన వేదికలలో పెడుతోంది. కూలిన ధరహార స్థూపం వద్ద కొందరు సెల్ఫీలు దిగుతున్నారు. కెమెరాల్లో స్నేహితులు ఫోటోలు దిగుతున్నారు. ధరహార స్థూపం 1800ల్లో నిర్మించారు. ఇది నేపాల్ దేశానికి అతి ముఖ్యమైన స్మారకం.

కొందరు ధరహార స్థూపం వద్ద, ఇతర చోట్ల ఫోటోలు దిగుతున్నారు. దీనిపై పవన్ అనే 21 ఏళ్ల వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నవ్వుతూ ఫోటోలు దిగడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది ఎర్త్‌క్వేక్ టూరిజం అవుతుందని, ఇది సరికాదన్నారు. కొందరు విషాద పరిస్థితిని అర్థం చేసుకోకుండా, సెల్ఫీలు, ఫోటోలు దిగడం ఏమిటంటున్నారు. మరోవైపు, ఆహారం, నీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సెల్ఫీ

సెల్ఫీ

కొంతమంది యువత వాటిని ఫోటోలు తీసు సామాజిక అనుసంధాన వేదికలలో పెడుతోంది. కూలిన ధరహార స్థూపం వద్ద కొందరు సెల్ఫీలు దిగుతున్నారు.

సహాయక చర్యలు

సహాయక చర్యలు

భూకంపం నేపథ్యంలో నేపాల్ రాజధాని ఖాట్మాండులో సోమవారం నాడు కొనసాగుతున్న సహాయక చర్యలు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

కొనసాగుతున్న సహాయక చర్యలు

భూకంపం నేపథ్యంలో నేపాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో నీరు, ఆహారం దొరకక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా వారు ఆకలితో అలమటిస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

కొనసాగుతున్న సహాయక చర్యలు

శనివారం భూకంపానికి తోడు, ఆ తర్వాత పలుమార్లు ప్రకంపనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేపాల్లో అందరు ఆరుబయటే ఉంటున్నారు.

ఖాట్మాండ్

ఖాట్మాండ్

గుడారాలలో తలదాచుకుంటున్నారు. అయితే, చాలామందికి ఆహారం, నీరు దొరకడం లేదు. పోలీసులు టెంట్లు, ఆహారం, నీరు ఇస్తుంటే.. స్థానికులు ఎగబడుతున్నారు.

English summary
Social media is a chronicle of life, and sometimes death. So it should be no surprise that a site of great human and cultural loss in Nepal's devastating earthquake is now barraged with the clicking of smartphones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X