వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయం కోసం వస్తే.. ఒంటరిగా రమ్మని చెప్పి.. ఆ డీఎస్పీ ఏం చేశాడంటే..

న్యాయం కోరుతూ తన వద్దకు వచ్చిన ఓ వివాహితపై కన్నేశాడు ఓ కీచక‘ఖాకీ’. బాధ్యత గల డీఎస్పీ హోదాలో ఉండి కూడా ఆమె నిన్సహాయ స్థితిని తనకు అవకాశంగా మలచుకోవాలనుకున్నాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్ : అత్తమామల వేధింపులు భరించలేక న్యాయం కోసం ఓ మహిళ డీఎస్పీ వద్దకు వచ్చింది. కేసు పెట్టేందుకు వచ్చిన వివాహితకు న్యాయం చేయాల్సిన సదరు డీఎస్పీ ఆమె నిన్సహాయ స్థితిని తనకు అనువుగా మలుచుకుని లైంగికంగా వేధించాడు.

ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని భటిండా పట్టణంలో వెలుగుచూసింది. అత్తమామల వేధింపులతో తనకు గర్భస్రావం అయిందని, న్యాయం చేయాలని కోరుతూ భటిండాకు చెందిన ఓ వివాహిత న్యాయం కోసం డీఎస్పీ హరీందర్ సింగ్ ను ఆశ్రయించింది.

Molestation to Married Woman by DSP

అన్యాయానికి గురై న్యాయం కోసం తనను ఆశ్రయించిన ఆ వివాహితకు న్యాయం చేయాల్సిన డీఎస్పీ హరీందర్ సింగ్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ.. ఆమెను లైంగికంగా వేధించాడు.

దీంతో సదరు వివాహిత నేరుగా జిల్లా ఎస్పీని కలిసింది. అత్తమామలతో రాజీ పడమని చెప్పడమేకాకుండా సదరు డీఎస్పీ తనను ఒంటరిగా రమ్మని చెప్పి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది.

దీంతో డీఎస్పీ హరీందర్ సింగ్ పై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ. నిజంగానే డీఎస్పీ వివాహితను లైంగికంగా వేధించాడని ప్రాథమిక విచారణలో తేలడంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 354 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

English summary
Being a responsible officer in the police department, Harinder Singh, who is working as DSP in Bhatinda town of Chandigarh, Punjab District molested that married woman. He suggested her to make a compromise with her in-laws and asked her to meet him alone to talk. She escaped from the DSP and directly went to SP and given a complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X