వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు షాక్: గాంధీ బొమ్మ లేని రూ. 2000 నోట్లిచ్చిన బ్యాంక్!

చేతికందిన కొత్త రూ.2000 నోట్లను చూసిన రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. ఆ నోట్లపై జాతిపతి మహాత్మాగాంధీ బొమ్మ లేదు.

|
Google Oneindia TeluguNews

భోపాల్‌: చేతికందిన కొత్త రూ.2000 నోట్లను చూసిన రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. ఆ నోట్లపై జాతిపతి మహాత్మాగాంధీ బొమ్మ లేదు. దీంతో వెంటనే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి అధికారులకు ఆ నోట్లను చూపించి తమ సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలోని ఓ ఏజెన్సీ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోట్లు తీసుకున్నారు. అయితే, తొలుత కొత్త నోట్లేగా చూసుకోవాల్సిన పనేముందనుకొని ఇంటికెళ్లారు.

MP farmers get 'genuine' Rs 2000 notes sans image of Mahatma Gandhi

అనంతరం చూసుకోగా వాటిపై గాంధీ బొమ్మ కనిపించలేదు. దీంతో అవి దొంగనోట్లు అనుకొని తిరిగి బ్యాంకు వద్దకు తీసుకురాగా వాటిని తనిఖీ చేసిన అధికారులు అవి దొంగనోట్లు కాదని, ఆర్‌బీఐ నోట్లేనని, వాటిని తీసుకొని తిరిగి వారికి వేరే నోట్లు ఇచ్చారు.
అయితే, ముద్రణలో లోపం వల్ల గాంధీ బొమ్మ నోట్లపై ముద్రితం కాలేదని బ్యాంకు అధికారులు చెప్పారు.

గాంధీ బొమ్మ ముద్రించాల్సిన చోట తెల్లగా వచ్చిందని, దీన్ని తిరిగి రిజర్వు బ్యాంకుకు పంపిస్తామని ఎస్బీఐ మేనేజరు శ్రావణ్ లాల్ చెప్పారు. గతంలోనూ హోషంగాబాద్ ప్రభుత్వ సెక్యూరిటీ ప్రెస్‌లో ముద్రించిన రూ.500 నోటుపై సెక్యూరిటీ థ్రెడ్ రాలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం నోట్ల ముద్రణను వేగిరం చేసిన నేపథ్యంలో ముద్రణలో పలు లోపాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

English summary
Farmers from a remote village in Madhya Pradesh's Sheopur district were taken aback when they received newly printed Rs 2000 notes without the image of Mahatma Gandhi from a State Bank of India branch. They thought the notes were fake. But when bank officials were approached, they took back the notes and said they were "genuine".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X