వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఆ శశికళ పోతే ఈ శశికళ వచ్చారా: ఎంత ఆశ, ఆశ్చర్యంతో నేతలు!

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేస్తానని ఆ పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సంచనల వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేస్తానని ఆ పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సంచనల వ్యాఖ్యలు చేశారు. శశికళ నటరాజన్ ఎంపిక చెల్లదని ఎన్నికల కమిషన్ కు మొదట ఫిర్యాదు చేసిన ఈమె ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చారు.

<strong>ఎన్నికల కమిషన్ నిర్ణయం: పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ!</strong>ఎన్నికల కమిషన్ నిర్ణయం: పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ!

శుక్రవారం ఆమె చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యాలని మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే వారిని పార్టీ నుంచి పూర్తిగా దూరం పెట్టాలని అన్నాడీఎంకేలోని రెండు వర్గాలకు సూచించారు.

MP Sasikala Pushpa said she will contest for the post of the AIADMK's general secretary

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీలో ఉన్నానని శశికళ పుష్ప బాంబు పేల్చారు. మిమ్మల్ని జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు కదా అని మీడియా ప్రశ్నిస్తే నేను అంటే గిట్టనివారు అమ్మకు మాయమాటలు చెప్పడం వలనే అలా జరిగిందని శశికళ పుష్ప చెప్పారు.

<strong>పార్టీ పదవికి శశికళ రాజీనామా ! పన్నీర్ సెల్వం వర్గం ఒత్తిడితో భారీ దెబ్బ!</strong>పార్టీ పదవికి శశికళ రాజీనామా ! పన్నీర్ సెల్వం వర్గం ఒత్తిడితో భారీ దెబ్బ!

అన్నాడీఎంకే పార్టీని ముందుకు నడిపించే సత్తా తనకు ఉందని శశికళ పుష్ప ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడటానికి రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప కూడా సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీ చేస్తానని శశికళ పుష్ప బహిరంగంగా చెప్పడంతో ఆ పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Sacked AIADMK Rajya Sabha MP Sasikala Pushpa said she will contest for the post of the AIADMK's general secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X