వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిద్దరూ కలిశారు , మ్యానిఫెస్టోను విడుదల చేసిన ములాయం,శివపాల్ కు దారేదీ?

తండ్రి కొడుకుల మద్య అంతరం ఉందని ప్రజలకు సంకేతాలువెళితే ఎన్నికల సమయంలో పార్టీకి నష్టమని అఖిలేష్ యాదవ్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల మ్యానిఫెస్టోను ములాయం సింగ్ .

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉచిత హమీలతో ఎన్నికల మ్యానిఫెస్టోను సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం నాడు విడుదల చేశారు.అయితే ఈ కార్యక్రమంలో తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్ లు మాత్రం గైరాజరయ్యారు.దీంతో ఎన్నికల మ్యానిపెస్టోను తండ్రి ములాయంతో విడుదల చేయించిన ఫోటోనుఅఖిలేష్ విడుదల చేశారు.

సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆదివారం నాడు ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం నాడు విడుదలచేశారు.

ఎన్నికల మ్యానిపెస్టోను విడుదల కార్యక్రమానికి తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్ లు హజరుకాలేదు.

సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ఇంకా సమసిపోలేదని, అందుకే ములాయం సింగ్ యాదవ్ ఈ కార్యక్రమానికి హజరుకాలేదని ప్రచారం సాగింది.

.ములాయంతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయించిన అఖిలేష్

.ములాయంతో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయించిన అఖిలేష్

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితహమీలతో అఖిలేష్ యాదవ్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తండ్రి ములాయం సింగ్ యాదవ్ హజరుకాలేదు.దీంతో అఖిలేష్ వ్యూహత్మకంగా వ్యహరించాడు. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో అఖిలేష్ యాదవ్ జాగ్రత్తపడ్డారు. తన తండ్రి సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తుండగా తీసిన ఫోటోను ఆయన విడుదల చేశారు.ఈ ఫోటోను సోషల్ మీడియాలో అఖిలేష్ పోస్ట్ చేశాడు.

ములాయం సింగ్, అఖిలేష్ మద్య కొనసాగుతున్న అంతరం?

ములాయం సింగ్, అఖిలేష్ మద్య కొనసాగుతున్న అంతరం?

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మద్య అంతరం కొనసాగుతూనే ఉంది. సమాజ్ వాదీ పార్టీని తన చేతుల్లోకి తీసుకొన్న అఖిలేష్ యాదవ్ తండ్రికి చెక్ పెట్టాడు.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ములాయంపై అఖిలేష్ యాదవ్ పై చేయి సాధించాడు.ఎన్నికల కమీషన్ కూడ అఖిలేష్ కే ఎన్నికల గుర్తును, పార్టీని కేటాయించింది. ఈ పరిణామాలు ములాయం ను కలవరపర్చాయి.దీంతో ములాయం అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాడు.

ములాయం ప్రచారంలో పాల్గొంటారా?

ములాయం ప్రచారంలో పాల్గొంటారా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీ కూటమితరపున ములాయం సింగ్ యాదవ్ ప్రచారం చేస్తారా అనేది ప్రస్తుతం చర్చసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ములాయం తేగేసి చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.అయితే ములాయం ప్రచారానికి దూరంగా ఉంటే పార్టీకి నష్టమనే అభిప్రాయాన్ని ఆ పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగానే ఎన్నికల మ్యానిపెస్టో విడుదల ములాయం దూరంగా ఉన్నందున , ఆయనతో మ్యానిఫెస్టోను విడుదల చేసినట్టుగా ఓ పోటోను అఖిలేష్ విడుదల చేశారు.

తండ్రి, బాబాయ్ లకు దారేదీ?

తండ్రి, బాబాయ్ లకు దారేదీ?

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు ఆయన సోదరుడు శివపాల్ కు ప్రస్తుతం ఏ దారి ఉంది.పార్టీని అఖిలేష్ యాదవ్ చేతుల్లోకి వెళ్ళింది. పార్టీకి ప్రచారం నిర్వహించకపోతే దాని ప్రభావంతో బిజెపికి కలిసివస్తే రాజకీయంగా బలహీనపడే అవకాశం లేకపోలేదు.దీంతో ఆయన బిజెపికిప్రయోజనం కలిగించే చర్యకు పూనుకొంటారా అనేది ఆసక్తి కల్గిస్తోంది.అయితే కొడుకుపై కోపంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ఆసక్తిని కల్గిస్తోంది.ఉత్తర్ ప్రదేశ్ రాస్ట్ర సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ కొనసాగిన కాలంలో నాక్టీలో అఖిలేష్ వర్గీయుల ప్రాధాన్యాన్ని తగ్గించారు.ప్రస్తుతం శివపాల్ కు కూడ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి.

English summary
mulayam released samajwadi party manifesto akhilesh yadav posted a photo on facebook
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X