దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన డాక్టర్, ఫ్రెండ్స్‌కు షేర్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ముంబైలో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. ఓ సహ వైద్యురాలు దుస్తులు మార్చుకుంటుండగా దానిని వీడియో తీసి నెట్లో అప్ లోడ్ చేశాడు. దీంతో అతనిని జుహు పోలీసులు అరెస్టు చేశారు.

హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె !

29 ఏళ్ల నిందితుడు తోటి మహిళా వైద్యురాలు బట్టలు మార్చుకుంటే వీడియో తీశాడని, దానిని తన స్నేహితులందరికీ చేరవేశాడని పోలీసులు తెలిపారు.

woman

వైద్యులు నివాసముండే క్వార్టర్స్‌లో ఈ సంఘటన జరిగింది. దుస్తులు మార్చుకుంటున్న వీడియోను మహిళా డాక్టర్‌ స్నేహితురాళ్లు ఆమెకు చూపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

తొలుత ఈ విషయాన్ని ఆమె స్నేహితురాళ్లు చెప్పినపుడు నమ్మలేదు. ఆ తర్వాత వీడియో చూసి ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. దీంతో వెంటనే ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీశారు. చివరకు ఓ డాక్టర్‌ నుంచి వచ్చిందని తేలింది.

దీంతో ఆమె ముంబైలోని జుహూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. 354, 379, 66ఏ, 67ఏ సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను ఎలాంటి వీడియోలు తీయలేదని అతను చెబుతున్నాడు.

English summary
Juhu police arrested a 29-year-old doctor from a government run hospital in Mumbai for allegedly filming his colleague while she was changing her clothes last month.
Please Wait while comments are loading...