వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ సమస్యతో నిలిచిన మోనో రైలు: ప్రయాణీకులు సురక్షితం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: విద్యుత్ వైఫల్యం కారణంగా ఆదివారం ముంబైలో మోనో రైలు సర్వీసులకు ఆటంకం కలిగింది. దీంతో వాడల ఏరియా ప్రాంతంలోని భక్తి పార్క్ సమీపంలో మోనో రైలు నిలిచిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు కంగారు పడ్డారు. ఆ సమయంలో రైలులో 11 మంది ప్రయాణీకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఫైర్ బ్రిగేడ్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు వాడల ప్రాంతంలో మోనోరైలు ఆగిపోయినట్లు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి మా రెస్క్యూ టీమ్‌ను పంపి అందులో చిక్కుకున్న 11 మందిని ప్రయాణీకులను రక్షించామన్నారు.

ఈ విషయంపై ఎమ్ఎమ్‌ఆర్‌డీఏ అధికారులను సంప్రదించగా... మోనోరైలు సేవలకు అంతరాయం కలిగిన మాట వాస్తవమేని, దీనిపై సాంకేతిక నిపుణులతో పాటు, రెస్క్యూ టీమ్‌ను వాడల ప్రాంతానికి పంపి అందులో చిక్కుకున్న వారిని రక్షించినట్లు పేర్కొన్నారు.

దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు సర్వీసులను ముంబైలో ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా ముంబైలోని వాడల-జెంబూర్ మోనోరైలు మార్గం 8.80 కిలోమీటర్లను ప్రారంభించారు. ఇందులో మొత్తం ఏడు స్టేషన్లు ఉన్నాయి.

మోనోరైలు ప్రత్యేకతలు:

Mumbai monorail service disrupted; 11 stranded passengers rescued

* నాలుగు బోగీల్లో 600 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది.
* 8.8 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
* గంటకు 35-80 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు నడుస్తాయి.
* గంటకు 18-20 వేల మంది వరకు ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం ఈ రైళ్లకు ఉంది.
* ఒక్క స్టేషన్‌కు కనీసం రూ.8-10 వరకు చార్జీ వసూలు చేస్తారు.
* ఆటోమాటిక్ డోర్లు, పూర్తి ఏసీ బోగీలుంటాయి.
* గులాబీ, నీలం, ఆకుపచ్చ రంగుల్లోని మూడు రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి.

English summary
Monorail services in Mumbai were today disrupted apparently due to power failure, leaving 11 passengers stranded inside the train near Bhakti Park in Wadala area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X