వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్టంలేని పెళ్లితో ఇంట్లోంచి పరారై.. తిండి తిప్ప‌లు లేక.. మూడ్రోజులు రైల్లోనే..

ఇష్టంలేని పెళ్లి చేయ‌డంతో ఓ యువ‌తి అత్తింట్లోంచి పారిపోయి రైలెక్కేసింది. ఆ త‌రువాత ఏం చేయాలో తెలియ‌క ఆ రైలులోనే మూడు రోజులు ఉండిపోయింది. తిండి లేక స్మృహ త‌ప్పి ప‌డిపోయిన ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సూరత్: త‌న‌కు ఇష్టంలేని పెళ్లి చేయ‌డంతో గుజ‌రాత్ లోని సూర‌త్ కు చెందిన దివ్య (20) అనే యువ‌తి అత్తింట్లోంచి పారిపోయింది. పోర్ బంద‌ర్ - ముంబై సౌరాష్ట్ర జ‌న‌తా ఎక్స్ ప్రెస్ రైలెక్కింది.

ఆ త‌రువాత ఏం చేయాలో తెలియ‌క ఆ రైలులోనే మూడు రోజులు ఉండిపోయింది.
ఈ మూడు రోజులూ నీళ్లు తాగ‌డం త‌ప్ప ఏమీ తిన‌క‌పోవ‌డంతో ఆమె స్మృహ త‌ప్పి ప‌డిపోయింది.

woman-scared

ఆమెను గుర్తించిన రైల్వే పోలీసులు మ‌హారాష్ట్ర‌లోని బోయిస‌ర్ లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. త‌న‌ను త‌న భ‌ర్త‌, ఆడ‌ప‌డుచులు, అత్త‌మామ‌లు వేధిస్తున్నార‌ని దివ్య తెలిపింది.

దివ్య ఓజాకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఆమె త‌ల్లితో కూడా మాట్లాడారు. మ‌రోవైపు త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని దివ్య భ‌ర్త సూర‌త్ లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దివ్య భ‌ర్త‌కు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

English summary
A 20-year-old woman from Udhna in Surat, Divya Anil Oza, travelled in long-distance trains without food and water for three days to escape torture by her in-laws, said police. The woman fell unconscious in the Porbander-Mumbai Saurashtra Janta Express on Saturday. Alert passengers informed police inspector Pramod Babar of Palghar GRP, who then got Oza admitted to a government hospital in Boisar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X