వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీ 1945లోనే మరణించారు: కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పింది. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి వివరాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.

ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సమాధానమిచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని బుధవారం స్పష్టం చేసింది.

Mystery ends: Subhash Chandra Bose died in plane crash in 1945, Govt says in a RTI reply

షానవాజ్‌ కమిటీ, జస్టిస్‌ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్‌ ముఖర్జీ కమిషన్‌‌ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన తరువాతే తాము నేతాజీ 1945లో మరణించారనే నిర్ధారణకు వచ్చామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

అంతేగాడా గుమ్నమి బాబాగా నేతాజీ మారువేషంలో జీవించారనే వాదననను కూడా అధికారులు కొట్టిపారేశారు. కాగా, దీనిని నేతాజీ కుటుంబ సభ్యులు ఖండించారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా నేతాజీ మరణించారని కేంద్రం ఎలా చెబుతుందని నేతాజీ మునిమనవడు చంద్రబోస్ ప్రశ్నించారు.

English summary
Ending 70-year old mystery over the death of Netaji Subhash Chandra Bose, government has replied to a RTI reply that Netaji died in a plane crash in Taiwan on August, 18 1945.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X