వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుకికి విషాదం: కాంగ్రెసుకు సంతోషం, సిఎం మార్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇటానగర్: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కలిగిన సంతోషం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నాబం తుకికి ఎన్నో రోజులు మిగలలేదు. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెసు లెజిస్లేటర్ పార్టీ (సిఎల్పీ) నాయకుడిగా కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పెమ ఖండు సిఎల్పీ నేతగా ఎన్నికయ్యారు.

అరుణాచల్ ముఖ్యమంత్రిగా ఖండు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. శాసనసభ బలనిరూపణలో కాంగ్రెసు విజయం సాధిస్తే ఖండు ముఖ్యమంత్రి అవుతారు. సిఎల్పీ ఓ ఒప్పందానికి వచ్చిందని, పేమ ఖండు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెసు ఎమ్మెల్యే కామెంగ్ డోలో చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి దోర్జీ ఖండు కుమారుడైన పేమ ఖండు సిఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిఎల్పీ సమావేశానికి 44 మంది శానససభ్యులు హాజరయ్యారు. బిజెపి మద్దతుతో ఫిబ్రవరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తిరుగుబాటు నేత ఖలికో పుల్ కూడా ఈ సమావేశానికి వచ్చారు.

Nabam Tuki resigns as Arunachal Congress leader ahead of floor test

37 ఏల్ల పేమ పర్యాటక, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ముక్తో నియోజకవర్గం నుంచి పేమ శానససభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ హిందూ కాలేజీ గ్రాడ్యుయేట్. 2005లో ఆయన అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా, 2010లో తవాంగ్ జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ సీట్ల సంఖ్య 58. ఇందులో 11 మంది బిజెపి శానససభ్యులు. ఇద్దరు స్వతంత్రులు. స్పీకర్ నాబం రెబియాతో కలిపి, తిరుగుబాటు శాసనసభ్యులు కూడా వెనక్కి రావడంతో కాంగ్రెసు శాసనసభ్యులు 45 మంది ఉన్నారు.

తమకు 44 మంది సభ్యులున్నారని తెలియజేస్తూ ఓ లేఖను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నాబం తుకి, పిసిసి అధ్యక్షుడు పడి రిచో, పేమ ఖండు, తదితరులు గవర్నర్‌కు లేఖ ఇవ్వనున్నారు.

శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవడానికి తనకు కొంత గడువు ఇవ్వాలని తుకి చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు. శుక్రవారంనాడు బలపరీక్షకు సిద్ధపడాల్సిందేనని యాక్టింగ్ గవర్నర్ తథాగత రాయ్ ఆదేశించారు. బలాన్ని నిరూపించుకోవడానికి కనీసం పది రోజుల గడువు ఇవ్వాలని తుకి కోరారు.

రాబోయేది వర్షాకాలం కాబట్టి బలపరీక్షకు ఆటంకాలు ఏర్పడుతాయని అంటూ గవర్నర్ తుకి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. తుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బలపరీక్షకు సిద్ధపడాలని గవర్నర్ ఆదేసించారు. ఈ పరిస్థితిలో తుకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెసు తిరిగి తన బలాన్ని నిలబెట్టుకోగా, తుకి మాత్రం దిగిపోవాల్సి వచ్చింది.

English summary
Ahead of Saturday's floor test in the Arunachal Pradesh state Assembly, Nabam Tuki has resigned as the Congress Legislature Party (CLP) leader, and Pema Khandu has been elected in his place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X