చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై సీబీఐ కార్యాలయంలో దినకరన్ విచారణ: మరో వికెట్ ఐపీఎస్ అధికారి!

చెన్నైలోని సీబీఐ కార్యాలయంలో దినకరన్, అతని అనుచరుడు మల్లికార్జనను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పి అదే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఎరవేశారని ఆరోపణలు రావడంతో ఢిల్లీలో అరెస్టు అయిన టీటీవీ దినకరన్, అతని అనుచరుడు మల్లికార్జునను విచారణ చెయ్యడానికి చెన్నై తీసుకు వచ్చారు.

<strong>రహస్యంగా చెన్నై స్టార్ హోటల్ లో భేటీ: సంతకాలు సేకరించిన సీఎం పళనిసామి!</strong>రహస్యంగా చెన్నై స్టార్ హోటల్ లో భేటీ: సంతకాలు సేకరించిన సీఎం పళనిసామి!

గురువారం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్, మల్లికార్జునను పిలుచుకుని కట్టుదిట్టమైన భద్రతో చెన్నై విమానాశ్రం చేరుకున్నారు. దినకరన్ ను చూడటానికి శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి నంజిల్ సంపత్, పూహళేంది ఎయిర్ పోర్టు చేరుకున్నారు.

Nanjil Sampath and Pugazhenthi visited Chennai Airport to see Dinakaran today.

అయితే నంజిల్ సంపత్, పూహళేంది తదితరులు దినకరన్ తో మాట్లాడటానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్ల లంచం ఎరవేశారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దినకరన్, మల్లికార్జునను అరెస్టు చేశారు.

<strong>టీటీవీ దినకరన్ తిక్కచేష్టలకు ఇంకో వికెట్ ! దెబ్బకు కొందరు మాయం, ఏం చేద్దాం?</strong>టీటీవీ దినకరన్ తిక్కచేష్టలకు ఇంకో వికెట్ ! దెబ్బకు కొందరు మాయం, ఏం చేద్దాం?

మొదట ఈ కేసులో అరెస్టు అయిన బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను మాత్రం చెన్నై తీసుకురాలేదు. దినకరన్ ను చెన్నైలో విచారించాలని ఢిల్లీ పోలీసు అధికారులు నిర్ణయించారు. చెన్నైలోని సీబీఐ కార్యాలయంలో దినకరన్, మల్లికార్జనను విచారిస్తున్నారు. ఈ కేసులో దినకరన్ తో పాటు తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని విచారించడానికి ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారని తెలిసింది.

English summary
Nanjil Sampath and Pugazhenthi visited Chennai Airport to see Dinakaran today. Delhi Police brings TTV.Dinakaran and his friend Mallikarjuna to Chennai for inquiry. Police going to start inquiry in CBI office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X