వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓడిన మహామహులు..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఓడి పోయారు. కుదాల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలోకి దిగిన నారాయణ్ రాణే తన ప్రత్యర్ది శివసేన అభ్యర్ధి వైభవ్ నాయక్ చేతిలో 10వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఐఎన్‌ఎల్‌డీ అధ్యక్షుడు అశోక్ అరోరా ఓటమి
హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్ అరోరా ఓడిపోయారు. ధానేసర్ నియోజక వర్గం నుంచి భాజపా అభ్యర్ది సుభాష్ సుధాపై అశోక్ ఓడిపోయారు. సుభాష్‌కు 34,479 ఓట్లు రాగా... అశోక్‌కు 20,216 ఓట్లు పోలయ్యాయి.

దుష్యంత్ చౌతాలా ఓటమి

Narayan Rane accepts defeat, takes solace in son's victory

హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ చీఫ్ ఓం ప్రకాస్ చౌతాలా మనవడు, పార్టీ యువనేత దుష్యంత్ చౌతాలా ఉచన్ కలన్ నియోజక వర్గం నుంచి ఓడిపోయారు. ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్ది ప్రేమలత చేతిలో ఓడిపోయారు.

సావిత్రి జిందాల్ ఓటమి
హర్యానాలోని హిస్సార్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ ఓటమి పాలయ్యారు. ఆమె తన సొంత నియోజక వర్గమైన హిస్సార్‌లో బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో 13,646 ఓట్ల తేడాతో చిత్తయ్యారు.

2008లో ఫోర్బ్స్ మ్యాగజైన్ భారత్ లో అత్యంత ధనిక మహిళగా సావిత్రికి ప్రథమ స్థానం కేటాయించింది. ఫోర్బ్స్ తాజా ఎడిషన్లోనూ సావిత్రి తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఓపీ జిందాల్ గ్రూపుకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న సావిత్రి కుటుంబ నెట్ వర్త్ రూ.395 బిలియన్లు. ఫోర్బ్స్ విడుదల చేసిన సంపన్న భారతీయుల జాబితాలో సావిత్రికి 12వ స్థానం లభించింది.

ఇక హర్యానాలో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకున్న పార్టీ ఈసారి ఏకంగా 46 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ సాగానికిపైగా స్థానాలు గెలుపొంది మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించింది. ఎంతో కాలం నుంచి హర్యానాలో ప్రాంతీయ పక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది.

English summary
Former chief minister and senior Congress leader Narayan Rane, who was defeated in the Assembly Elections from Kudal in Sindhudurg district, said Sunday afternoon that he accepted the outcome.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X