వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ప్రసూతి, శిశు మరణాల రేట్లు ఆందోళనకర రీతిలో ఉన్నాయని, వైద్య సదుపాయాలను నిరుపేదల దరికి చేర్చాలంటే 'మేకిన్ ఇండియా', 'డిజిటల్ ఇండియా'లను సాధనాలుగా ఉపోయోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.

శనివారం నాడిక్కడ రిలయన్స్‌ ఫౌండేషన్‌ పునః నిర్మించిన తొంభై ఏళ్ల నాటి హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశంలో వ్యాధులు విజృంభించాక చికిత్స మొదలు పెట్టే బదులు అసలు వ్యాధులే రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం మేలన్నారు.

ఇలా చేయటం వల్ల దేశంలో ఆరోగ్య సేవల నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. ముంబైలో మొట్ట మొద టి జనరల్‌ ఆస్పత్రి అయిన ఈ ఆస్పత్రిని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు అధునాతన వసతులతో తీర్చిదిద్దిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ కృషిని ప్రధాని అభినందించారు.

దిగుమతులు భారంగా మారినందున వైద్య రంగానికి అవసరమైన యంత్ర పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అత్యాధునిక రోగ నిర్ధారక పరికరాలు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత రోజుల్లో అత్యంత ఖరీదైన వైద్య సాధనాలను తయారు చేసేందుకు భారత్‌కు రావాలని ఆయన విదేశీ సంస్ధలకు ఆహ్వానం పలికారు.

"కర్ణుడు తల్లి గర్బం నుంచి జన్మించలేదని మహాభారతం చెబుతోంది. అంటే ఆరోజుల్లోనే జన్యుపరమైన సైన్స్‌పై ప్రజలకు అగవాహన ఉందన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు." అని అన్నారు.

 నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ పునః నిర్మించిన తొంభై ఏళ్ల నాటి హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను శనివారం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.

 నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ పునః నిర్మించిన తొంభై ఏళ్ల నాటి హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి మెమోంట్‌ను బహుకరిస్తున్న కోకిలా బెన్.

 నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

దేశంలో ప్రసూతి, శిశు మరణాల రేట్లు ఆందోళనకర రీతిలో ఉన్నాయని, వైద్య సదుపాయాలను నిరుపేదల దరికి చేర్చాలంటే 'మేకిన్ ఇండియా', 'డిజిటల్ ఇండియా'లను సాధనాలుగా ఉపోయోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ


రిలయన్స్‌ ఫౌండేషన్‌ పునః నిర్మించిన తొంభై ఏళ్ల నాటి హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవ సమయంలో ఇటీవల రిలయన్స్ ఛైర్మన్లగా బాధ్యతలను స్వీకరించిన అంబానీ వారసులతో ప్రధాని మోడీ.

 నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ పునః నిర్మించిన తొంభై ఏళ్ల నాటి హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవ సమయంలో నీతా అంబానీతో అప్యాయంగా ప్రధాని మోడీ. ప్రక్కనే ముకేశ్ అంబానీ.

 నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

శనివారం ముంబైలో హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండే,న్ హాస్పిటల్‌లో సిబ్బందితో సంభాషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. చిత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.

 నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

నీతా అంబానీతో ఆప్యాయంగా ప్రధాని మోడీ

"కర్ణుడు తల్లి గర్బం నుంచి జన్మించలేదని మహాభారతం చెబుతోంది. అంటే ఆరోజుల్లోనే జన్యుపరమైన సైన్స్‌పై ప్రజలకు అగవాహన ఉందన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు." అని అన్నారు.

"వినాయకుడికి ఏనుగు తలను అతికించారంటే ఆ రోజుల్లోనూ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారేమో"నని ప్రధాని మోడీ అన్నారు. వందల సంవత్సరాల క్రితం ఆర్యభట్ట ఏదైతే చెప్పారో ఆ విషయాలను ప్రపంచం ఇప్పుడు ఒప్పుకుందని చెప్పారు.

90 ఏళ్లనాటి ఆసుపత్రిని రిలయన్స్ ఫౌండేషన్ 'కాయకల్ప్' వైద్యంలా పునరుద్ధరించినట్లు... దేశాన్ని తిరిగి తీర్చిదిద్దడం కూడా సాధ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, కోకిలాబెన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్, సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, నీతు కపూర్, షారుఖ్ ఖాన్, సునీల్ గవాస్కర్, హృతిక్ రోషన్, కాజోల్, అమీర్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్, ప్రపుల్ పటేల్, రాణి ముఖర్జీ, మహారాష్ట్ర బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ టాడ్వే తదితరులు పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi being welcomed by by Reliance Foundation Chairperson Nita Ambani and Mukesh Ambani at the re-dedication and inauguration of HN Reliance Foundation Hospital in Mumbai on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X