వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య: మోడీ కేబినెట్లోకి కొత్తగా తెలుగువారికి చోటు దక్కేనా?

వెంకయ్య నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పట్టణాభివృద్ధి శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు పూర్తి మంత్రిగా ఎవరూ లేకుండా పోయారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వెంకయ్య నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పట్టణాభివృద్ధి శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు పూర్తి మంత్రిగా ఎవరూ లేకుండా పోయారు.

దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముంది. ఇప్పటికే రక్షణ, పర్యావరణ శాఖలకు పూర్తిస్థాయి మంత్రులు లేరు.

పవన్‌తో మాట్లాడుతున్నాం, కంట్రోల్ చేసుకోవాలి: బాబు, ఎన్టీఆర్ గాలి వీచినా...పవన్‌తో మాట్లాడుతున్నాం, కంట్రోల్ చేసుకోవాలి: బాబు, ఎన్టీఆర్ గాలి వీచినా...

ఖాళీలు ఇలా..

ఖాళీలు ఇలా..

రక్షణ శాఖకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పర్యావరణ శాఖకు శాస్త్ర, సాంకేతిక రంగ మంత్రి హర్షవర్దన్‌లు అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల అనంతరం మంత్రిమండలి పునర్‌వ్యస్థీకరణ ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు కొత్తవారికి ఈ సారి అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.

వెంకయ్య ఖాళీతో తెలుగువారికి అవకాశం ఉంటుందా?

వెంకయ్య ఖాళీతో తెలుగువారికి అవకాశం ఉంటుందా?

ఇదిలా ఉండగా, వెంకయ్య స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ సాగుతోంది. ఆయన స్థానంలో మరో తెలుగు వ్యక్తికి అవకాశం ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వెంకయ్యను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. అయినప్పటికీ తెలుగు వ్యక్తిగానే భావిస్తారు.

ఇరు రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం లేకపోలేదు

ఇరు రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం లేకపోలేదు

పర్యాటక శాఖ, రక్షణ శాఖ, సాంకేతిక శాఖలకు తోడు ఇప్పుడు పట్టణాభివృద్ధి, సమాచార శాఖలకు మంత్రి రాజీనామా చేయడంతో.. వెంకయ్య రాజస్థాన్ నుంచి వెళ్లినప్పటికీ ఆ రాష్ట్రానికి చెందిన ఓ నేతతో పాటు తెలుగు వ్యక్తికి కూడా ఒకరికి కేబినెట్లో ఛాన్స్ దక్కవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి ఛాన్స్?

తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి ఛాన్స్?

గత కేబినెట్ విస్తరణ సమయంలోనే టిడిపి నేతలు మరో మంత్రి పదవిని ఆశించారు. తెలంగాణలో టిఆర్ఎస్ కనుక ఎన్డీయేలో చేరితే వారిని కేబినెట్లోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి వ్యక్తికి ఇస్తారా? మంత్రి పదవి కోరుకుంటున్న టిడిపికి ఇస్తారా? లేదంటే తెరాస ఎన్డీయేలో చేరితే వారికి ఇస్తారా అనేది ప్రశ్నే అంటున్నారు.

English summary
Venkaiah Naidu's nomination to VP post means the urban development and I&B departments will be without full scale ministerial heads. Ministries of defence and environment are already being handled by finance minister Arun Jaitley. This raises the probability of a reshuffle after the end of the monsoon session of Parliament next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X