వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ధి జరిగితే అడ్డు అనే.. సీఆర్పీఎఫ్‌పై నక్సలైట్ల ప్రతీకారం

చత్తీస్‌గఢ్‌లో సోమవారం నాడు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఇటీవలి కాలంలో అతి పెద్దది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో జవాన్ల శరీరం ముక్కలు ముక్కలు అయింది.

|
Google Oneindia TeluguNews

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో సోమవారం నాడు సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఇటీవలి కాలంలో అతి పెద్దది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో జవాన్ల శరీరం ముక్కలు ముక్కలు అయింది.

జవాన్ల పైన నక్సలైట్ల దాడిని చూస్తే వారు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా కనిపిస్తుంది. చనిపోయిన జవాన్లలో పలువురి బాడీలను నక్సలైట్లు ముక్కలు ముక్కలుగా చేశారని తెలుస్తోంది.

నక్సలైట్లు దాడి చేసిన తీరును చూస్తుంటే.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు సీఆర్పీఎఫ్ లేదా సైన్యం నుంచి ఎలాంటి సహకారం చేయవద్దనే ఉండవద్దని నక్సలైట్లు కోరుకుంటున్నారని భావిస్తున్నారు. అభివృద్ధి పనులకు సీఆర్పీఎఫ్ సహకారం వద్దని వారు హెచ్చరించారంటున్నారు.

crpf

సుకుమా జిల్లాలో పెద్ద రోడ్డును నిర్మిస్తున్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమం కోసం సీఆర్పీఎఫ్ రక్షణగా ఉంది. ఇది నక్సలైట్లకు ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు.

ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే తమకు అడ్డంకిగా మారుతుందని నక్సలైట్లు భావించారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోడ్లు నక్సలైట్ల ప్రధాన ప్రాంతాల నుంచి కూడా వెళ్తుంది. దీనిని వారు అడ్డుకోవాలని భావించారు.

English summary
The analysis of the attack which was conducted suggests that the prime intention was to send a strong message to the CRPF not to help with developmental work in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X