వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ సూచన మేరకే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక: మోడీ ఫోన్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్లు ప్రధాని తెలిపారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినట్లు ప్రధాని తెలిపారు.

ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడుతూ.. 'ఒక దళిత నాయకుడిని రాష్ర్టపతిగా ఎంపిక చేయాలని మీరు సూచించారు. మీ సూచన మేరకు దళిత నేతనే రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం, అందుకే మీకు ముందుగా ఫోన్ చేస్తున్నాను, మీ పూర్తి మద్దతు కోరుతున్నాను..' అన్నారు.

cm-kcr-pm-modi

ప్రధానితో సంభాషణ అనంతరం సీఎం కేసీఆర్ వెంటనే పార్టీ నేతలను సంప్రదించారు. ఒక దళిత నేతకు అవకాశం వచ్చినందుకు, ప్రధాని విజ్ఞప్తి మేరకు, ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

ఈ మేరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఎన్డీఏ రాష్ర్టపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ మద్దతు తెలిపినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కూడా ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ గోవింద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు.

English summary
A clutch of regional parties from southern India backed Bihar governor Ram Nath Kovind for India’s next President on Monday as the Congress expressed its disappointment at not being consulted before the Dalit leader’s name was finalised. Minutes after the 71-year-old former Rajya Sabha MP’s candidature was announced by BJP chief Amit Shah, the Telangana Rashtra Samiti supported Kovind. The party has 11 seats in the Lok Sabha, three in the Rajya Sabha and 63 in the state assembly. “Hon’ble PM narendramodi Ji has telephoned Hon’ble CM KCR seeking support for Sri Ramnath Kovind Ji as President. CM has agreed to support,” chief minister K Chandrasekhar Rao’s office tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X