వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినూత్నం: ఎఫ్‌బి ప్రొఫైల్ బాగుంటే లోన్ ఇస్తామంటున్న 'క్యాష్ ఈ'!

లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించగలడా? అన్న విషయాన్ని కూడా ఫేస్ బుక్ ఆధారంగానే క్యాష్ ఈ నిర్దారించుకుంటుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మీ యథార్థ గాథకు వెయ్యికి పైగా లైక్స్ వస్తే రుణం ఇవ్వడానికి సిద్దమంటూ ఇటీవల టాటా క్యాపిటల్ వినూత్న రుణ మంజూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరో వినూత్న కార్యక్రమాన్ని క్యాష్ ఈ అనే స్టార్టప్ సంస్థ ప్రవేశపెట్టింది.

రూట్ మారిన రుణం, వెయ్యి లైక్స్‌తో రూ.1లక్ష: టాటా సరికొత్త ప్రోగ్రామ్..రూట్ మారిన రుణం, వెయ్యి లైక్స్‌తో రూ.1లక్ష: టాటా సరికొత్త ప్రోగ్రామ్..

కేవలం ఫేస్ బుక్ ప్రొఫైల్ ఆధారంగా రుణ మంజూరు చేయడం దీని ప్రత్యేకత. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఫేస్ బుక్ ఖాతాను పరిశీలించి.. అన్ని విధాలుగా ఓకె అనుకున్న తర్వాత సదరు వ్యక్తికి రుణం మంజూరు చేయడం జరుగుతుందని క్యాష్ ఈ ప్రతినిధులు చెబుతున్నారు.

CASHe

లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించగలడా? అన్న విషయాన్ని కూడా ఫేస్ బుక్ ఆధారంగానే క్యాష్ ఈ నిర్దారించుకుంటుంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.50కోట్ల నిధులను సమీకరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా కస్టమర్ రుణ చరిత్రను ఈ సంస్థ పసిగడుతుంది. సోషల్ మీడియా వేదికలపై కస్టమర్ కదలికల డేటాను సేకరించి ఆ వివరాల ఆధారంగా రుణం మంజూరు చేస్తుంది.

లోన్ విషయంలో కస్టమర్ మొబైల్ డేటా, కాంటాక్ట్స్, యాప్స్ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని క్యాష్ ఈ వ్యవస్థాపకులు వి.రమణకుమార్ తెలిపారు. రుణాన్ని మంజూరు చేసే పూర్తి స్థాయి యాప్ ఆధారిత కంపెనీ దేశంలో తమదేనని చెప్పారు. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటివి ఏమి ఉండవని, రుణం తీసుకునే వారి సంతకం కూడా తీసుకోమని, అంతా యాప్ ద్వారానే సాగుతుందని అన్నారు.

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్ లో 'క్యాష్ ఈ' యాప్ అందుబాటులో ఉంటుంది. కేవలం 5సులభ ప్రక్రియలతో యాప్ ద్వారా రుణం సొంతం చేసుకోవచ్చు. ఫేస్ బుక్, లింకెడ్ ఇన్ ఖాతాల ద్వారా దీనిలోకి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆపై యాప్ లో సూచించిన అర్హతలకు అనుగుణంగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ ఫర్ లేదా చెక్ ద్వారా తిరిగి రుణాన్ని చెల్లించవచ్చు. వన్ క్యాపిటల్ అనే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ద్వారా క్యాష్ ఈ రుణాలను మంజూరు చేస్తోంది.

English summary
When you are a startup which lends to borrowers with no credit history or at best, a subpar credit rating, how do you judge their repaying capability?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X