వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నీట్’లో స్పష్టత రాని రాష్ట్ర ర్యాంకులు: విద్యార్థుల్లో ఆందోళన

‘ఓ విద్యార్థికి జాతీయ స్థాయిలో 3,478 ర్యాంకు వచ్చింది. రాష్ట్రస్థాయిలో ఎక్కడున్నాడో తెలియదు. నిపుణులు మాత్రం 250 లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'ఓ విద్యార్థికి జాతీయ స్థాయిలో 3,478 ర్యాంకు వచ్చింది. రాష్ట్రస్థాయిలో ఎక్కడున్నాడో తెలియదు. నిపుణులు మాత్రం 250 లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు. మరో విద్యార్థికి జాతీయ స్థాయిలో 15వేలకు పైగా ర్యాంకు వచ్చింది. రాష్ట్ర ర్యాంక్ ఎంత అన్న సంగతి తెలియదు. 'ఏ' కేటగిరిలో సీటు వస్తుందా? 'బీ' కేటగిరిలో సీటు వస్తుందా? అన్న దానిపై సమాచారం లేక తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు.

ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య వైద్య కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థుల పరిస్థితి. ఫలితాలు వెల్లడై రెండు రోజులైనా.. రాష్ట్ర స్థాయి ర్యాంకులపై స్పష్టత కాన రాక విద్యార్థులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
దేశ వ్యాప్తంగా నీట్‌ ప్రవేశపరీక్ష నిర్వహించి జాతీయ స్థాయి ర్యాంకులు మాత్రమే ప్రకటించారు.

రాష్ట్రస్థాయి ర్యాంకులు తెలియకపోవడంతో సీటు వస్తుందో.. రాదో? అనే సందిగ్ధం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలోనే ప్రవేశాలు జరగనున్నాయి. అందువల్ల రాష్ట్రస్థాయి ర్యాంకు గురించి ఖచ్చితంగా తెలిస్తేనే సీటు రాకపై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. జాతీయస్థాయి ర్యాంకులతో పాటే రాష్ట్ర ర్యాంకులను వెల్లడించేలా చర్యలు తీసుకోకపోవడంతో అయోమయం నెలకొంది.

5000 ర్యాంకుల్లో 500 మంది!

5000 ర్యాంకుల్లో 500 మంది!

నీట్‌ ర్యాంకుల ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై విద్యారంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం ‘‘జాతీయస్థాయిలోని తొలి 1000 ర్యాంకుల్లో 130 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత ప్రతి 1000 జాతీయ స్థాయి ర్యాంకుల్లో తెలుగు విద్యార్థుల స్థాయి తగ్గి, తొలి 5000 ర్యాంకుల్లో కేవలం 500 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పది వేల ర్యాంకుల్లో ఈ సంఖ్య బాగా తగ్గి 800 వరకు ఉండే అవకాశం ఉంది. ఇలా జాతీయ స్థాయిలో తొలి 20 వేలలోపు 1,550 వరకు, 30వేల లోపు 2500 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉంటారని అంచనా. సీట్ల లభ్యత అనుసరించి ఇంకా పెద్ద ర్యాంకు సాధించిన విద్యార్థుల అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీ సామాజిక వర్గాల వారీగా జరుగుతుంది.

నీట్ ఆధారంగానే బీ, సీ కేటగిరీ సీట్లు భర్తీ

నీట్ ఆధారంగానే బీ, సీ కేటగిరీ సీట్లు భర్తీ

ఎంబీబీఎస్‌ బీ, సీ కేటగిరి సీట్లను కూడా నీట్‌లో అర్హత సాధించిన వారితోనే భర్తీ చేయనున్నారు. 720 మార్కులకు 350కుపైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు సీట్లు లభించే అవకాశం ఉంది. ఏడాదికి రూ.15-16 లక్షల ఫీజు చెల్లించే స్థోమత ఉన్న వారు తక్కువ మంది ఉంటారు. దీనివల్ల పెద్ద ర్యాంకు సాధించిన వారికి యాజమాన్య కోటాలో సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. సీట్ల విభజనకు పూర్వం ఎలా ఉందో అదేవిధంగా ఇంచుమించు సీట్ల భర్తీ జరగబోతుంది' అని తెలిపారు.

131 మార్కుల కటాఫ్‌

131 మార్కుల కటాఫ్‌

జనరల్‌ కేటగిరి విద్యార్థులకు 131 మార్కులు కటాఫ్‌ కింద నిర్ధారణ అయింది. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 107, జనరల్‌ వికలాంగ విద్యార్థులకు 118 కటాఫ్‌ మార్కు కింద ఉంది. వీటి ఆధారంగా దేశంలోని 470 వైద్య కళాశాలల్లో ఉన్న 65,730 సీట్లకు 308 దంత కళాశాలల్లోని 26,730 సీట్లకు కలిపి 6,11,539 మంది విద్యార్థులు అర్హత సాధించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కటాఫ్‌ మార్కు తగ్గిందని భావిస్తున్నారు. మార్కులసాధనలో విద్యార్థులమధ్య గట్టి పోటీ నెలకొంది.

త్వరలో ప్రవేశ ప్రకటన జారీ

త్వరలో ప్రవేశ ప్రకటన జారీ

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28, 29 తేదీల్లో ప్రవేశ ప్రకటన జారీ చేస్తామని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు. సీబీఎస్‌ఈ అధికారుల నుంచి జాబితా వచ్చిన వెంటనే వెబ్‌సైట్‌లో పెడతామని, విద్యార్థులనుంచి దరఖాస్తులు అందిన తర్వాత వైద్య సీట్లకు ఉన్న పోటీ తెలిసిపోతుందన్నారు. జులైలో ప్రవేశాల కౌన్సెలింగ్‌, ఆగస్టు ఒకటోతేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డాక్టర్ రవిరాజ్ చెప్పారు.

English summary
CBSE released NEET - 2017 results declared on 23rd of this month. But Telangana and Andhra Pradesh had pecular situation. These Two states have 371 D article in Constitution. As per 371 D article these states to give adimissions for non - local seats simultanously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X