వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరిగిన అత్యాచారాలు: 'నెహ్రూ, గాంధీ కుటుంబం చలవే'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జైపూర్: దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, వేధింపు కేసులకు జెఎన్‌యు విద్యార్థులే కారణమంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్‌దేవ్ అహుజా మంగళవారం నెహ్రూ, గాంధీ కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

'జెఎన్‌యూ వర్సిటీలో రోజుకు 3000 కండోమ్‌లు''జెఎన్‌యూ వర్సిటీలో రోజుకు 3000 కండోమ్‌లు'

భారత్‌లో సామాజిక సమస్యలకు నెహ్రూ కుటుంబమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భారత్‌లో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలకు నెహ్రూ, గాంధీ కుటుంబమే కారణమని విమర్శించారు. ఇరాక్‌లోని సెంట్రల్ బాగ్దాద్‌లో ఆ దేశ నియంత సద్దాం హుస్సేన్ ఐకానిక్ విగ్రహాన్ని నేలమట్టం చేసిన తరహాలోనే భారత్‌లో గాంధీల పేరిట ఉన్న అన్ని విగ్రహాలు, స్మారక కట్టడాలను కూడా తక్షణమే కూల్చివేయాలన్నారు.

కాగా, ఆసక్తికరంగా ప్రధాని నరేంద్ర మోడీని దైవాంశ సంభూతిడిగా అహుజా అభివర్ణించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను ఆయన త్వరలోనే రూపుమాపుతారని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఆల్వార్ రామ్‌గర్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున గెలుపొందారు.

Nehru, Gandhi family responsible for rising rapes in India, says BJP MLA Gyandev Ahuja

ఇదిలా ఉంటే సమాజంలో పెరుగుతున్న అత్యాచారాలు నెహ్రూ కుటుంబం చలవేనని అహుజా చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ కాంగ్రెస్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనకు పిచ్చి పట్టిందని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చించాలని వ్యాఖ్యానించింది.

గతంలో జెఎన్‌యూ విద్యార్దులు తాగుబోతులని, తిరుగుబోతులని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. వర్సిటీ ప్రాంగణంలో రోజుకు 3000 వాడిన కండోమ్‌లు, 4000 వరకూ మద్యం సీసాలు కనిపిస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు జెఎన్‌యూ విద్యార్ధులు డ్రగ్స్‌కు బానిసలని చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.

English summary
Controversial Rajasthan Bharatiya Janata Party (BJP) MLA Gyandev Ahuja, who had earlier courted a controversy by claiming that JNU students indulge in sex and booze and go naked on campus, has now attributed the growing instances of rapes in India to the Nehru, Gandhi family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X