వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1934 భూకంపాన్ని గుర్తు చేసిన విధ్వంసం: మరో ముప్పు?

By Pratap
|
Google Oneindia TeluguNews

ఖాట్మండ్: నేపాల్‌ను శనివారంనాడు తాకిన భూకంపం 1934 నాటి విధ్వంసాన్ని గుర్తు చేస్తోంది. 1934లో బీహార్ - నేపాల్ భూకంపం నాటి విధ్వంసాన్ని ప్రస్తుత భూకంపం గుర్తు చేస్తోంది.

ఆనాటి భూకంప తీవ్రతకు నేపాల్‌లో 12 వేల మంది, బీహార్‌లో 7253 మంది మరణించారు. ఆనాటి భూకంపంలో ముంగర్, ఖాట్మండు, ముజఫర్‌పూర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ భూకంపం 1934 జనవరి 15వ తేదీన సంభవించింది. మరో భూకంపం నేపాల్‌లో 1988లో సంభవించింది.

Nepal earthquake: Recounting the 1934 horror

భూకంపానికి గజగజ వణికిపోతున్న నేపాల్‌కు ఇంకా ప్రమాదం తప్పలేదని అంటున్నారు. వచ్చే 24 గంట్లో మరో భూకంపం తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన దర్భాంగా, ఆరిరియాల్లో మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆ విషయాన్ని మెటలర్జికల్ విభాగం అధికారులు మీడియాకు తెలిపారు సాధారణంగా భుకంపాలు తాకిన తర్వాత ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. ఇదే క్రమంలో మరోసారి భూకంపం రావచ్చునని అంటున్నారు.

Nepal earthquake: Recounting the 1934 horror

కుప్పకూలిన కామాఖ్యదేవి ఆలయం

భూకంపం తీవ్రతకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య ప్రాంతంలో గల కామాఖ్యదేవి ఆలయం కుప్పకూలిదంి. ఆలయం పైకప్పు కూలిపోయింది. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇది అతి పురాతనమైన దేవాలయం.

Nepal earthquake: Recounting the 1934 horror

బీహార్‌లో కూలిన స్కూల్ భవనం

శనివారంనాటి భూకంప తీవ్రత భారతదేశంలో బీహార్‌పై ఎక్కువగా ఉంది. బీహార్‌లో ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు చెబుతున్నారు. బీహార్ భగల్‌పూర్ గోడ కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించారు. సీతామడి, దర్భాంగా, వైశాలి భవనలా కూలిపోయి ముగ్గురు మరణించారు. మల్దాలో ఓ పాఠశాల భవనం కుప్పకూలి 40 మంది విద్యార్థులు గాయపడ్డారు.

English summary
The earthquake to hit Nepal today was probably the worst after the devastation of 1934. In the year 1934 the Earthquake known as the Bihar-Nepal earthquake was considered to be the worst the region had experienced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X