వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూకంపం: జంతువులు, పక్షాలు ముందే హెచ్చరిస్తాయి, ఏవి ఎలా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు వచ్చే సమయంలో జంతువుల ప్రవర్తనను క్షుణ్ణంగా గమనిస్తే ఏదో జరుగుతుందని మనం ఊహించవచ్చు! విపత్తులు వచ్చే సమయంలో జంతువుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మన చుట్టూ ఉండే జంతువులు, పక్షాలు అలాంటి సందర్భాల్లో ఎప్పటి కంటే భిన్నంగా ప్రవర్తిస్తాయి.

2008 మే 12న చైనాలో భూకంపం వచ్చింది. ఆ సమయంలో వోలాగం నేషనల్ నేచర్ రీసెర్చ్ సెంటర్లో ఉన్న పాండాలు భిన్నంగా ప్రవర్తించాయి. సహజంగా పాండాలు లేజీగా ఉంటాయి. బాంబూను కొద్దిగానే తింటాయి. అయితే, నాడు భూకంపానికి ముందు అవి అన్నింటిని చాలా వేగంగా చేశాయి.

Nepal quake: Did animals signal the earthquake?

జంతువులు, పక్షులకు ఘ్రాణ శక్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ నేపథ్యంలో విపత్తులు జరిగే సమయాల్లో అవి ముందే గ్రహిస్తాయి. కొన్ని సందర్భాల్లో అవి 48 గంటల ముందు కూడా విపత్తులను గుర్తించగలవంటున్నారు.

బంగారు రంగులో ఉండె రెక్కలు గలిగిన ఓ పక్షి (గోల్డెన్ వింగ్డ్ వార్బ్‌లర్స్) భారీ తుఫానుకు 48 గంటల ముందే ఆ ప్రాంతం నుండి వెళ్లి పోతుంది.

Nepal quake: Did animals signal the earthquake?

కుక్కలు, పిల్లులు కూడా అధిక గ్రహణ శక్తిని కలిగి ఉంటాయి. 2011లో 9 తీవ్రతతో భూకంపం వచ్చిన సమయంలో హిరోయుకి యమౌచి ఆఫ్ నేషనల్ సింగ్ హ్యూ యూనివర్సిటీ ఓ అధ్యయనం చేసింది. ఆ పరిశోధనలో, పిల్లులు భూకంపం వచ్చే ఆరు రోజుల ముందే అసాధారణంగా ప్రవర్తించాయి.

కొన్ని జీవులు విపత్తులు వచ్చే సమయాల్లో వణుకుతున్నట్లుగా, రెస్ట్ లెస్‌గా, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా, ఆందోళనగా కనిపిస్తాయి. మనుషుల కంటే పిల్లులకు చాలా ఎక్కువగా గ్రహణ శక్తి ఉంటుంది.

Nepal quake: Did animals signal the earthquake?

అవి వాతావరణంలో వచ్చే మార్పులను గుర్తించగలవు. కుక్కలు అసాధారణంగా అరుస్తాయి.

విపత్తుల సమయాల్లో ఆవులలో కూడా మార్పులు కనిపిస్తాయి. భూకంపాలు వచ్చేకంటే ఆరు రోజుల ముందు నుండి ఆవులు పాలను తక్కువ మోతాదులో ఇస్తాయి.

భారీగా వర్షాలు వచ్చే పరిస్థితి ఉంటే తేనెటీగలు ఎక్కడకు వెళ్లవు. అవి తేనెతుట్టెల్లోనే ఉంటాయి. తుఫాన్లు వచ్చే సమయాల్లో షార్క్‌ల్లోను తేడా కనిపిస్తోంది.

సిల్వర్ ట్రిప్ గ్రిజ్లీ బియర్స్‌కు కూడా మంచి గ్రహణ శక్తిని కలిగి ఉంటాయి. 2004లో సునామీకి ముందు ఏనుగులు అసాధరణంగా ప్రవర్తించాయి. ఆ సమయంలో ఏనుగులు తరంగ శబ్దాలను గ్రహించి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కంపనాలు 20 హెడ్జెస్ కంటే తక్కువగా ఉంటాయి. మానవుడు 27.5 హెడ్జెస్ ఉంటే గుర్తించగలడు.

English summary
Forget the Siesmograph, it can misguide. Nature has provided us with tools that we ignore or take casually when it comes to something as serious as a natural calamity. Observe animals and birds around you and you could sense a change in their behavioural pattern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X