వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ నిందితుడి ఇంటర్వ్యూ కలకలం: అధికారులపై హోంమంత్రి ఆగ్రహం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులోని నిందితుడు ముఖేష్ సింగ్ ఇంటర్వూ కేంద్ర ప్రభుత్వానికి తల నొప్పిగాతయారయింది. నిర్బయ కుటుంబ సభ్యులు, మహిళ సంఘాలు ఈ ఇంటర్వూ ఎలా ఇచ్చారు అని సూటిగా ప్రశ్నించడంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీహార్ జైలు అధికారులకు స్వయంగా ఫోన్ చేసి క్లాస్ పీకారని తెలుస్తోంది. ముఖేష్ కుమార్‌ను ఇంటర్వూ చెయ్యడానికి అనుమతి ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? అని పూర్తి వివరణ ఇవ్వాలని జైళ్ల శాఖ డీఐజీని వివరణ కోరారని సమాచారం.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా జోక్యం చేసుకొవడంతో జైళ్ల శాఖ అధికారులకు దడపుట్టిస్తోంది. ముఖేష్ కుమార్ బీబీసీ చానెల్ కు ఇంటర్వూ ఇచ్చాడు. అందులో అత్యాచారాలకు అమ్మాయిలదే పూర్తి భాద్యత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Nirbhaya

అదే విదంగా నిర్బయ తమకు సహరించి ఉంటే వదిలి పెట్టి ఉండేవారమని, ప్రతిఘటించడం వలనే చంపేశామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. యువతిని దారుణంగా హత్య చేసిన ఒక మృగాడిని ఇంటర్వూ చెయ్యడానికి తీహార్ జైలు అధికారులు ఏలా అనుమతి ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. జైలు అధికారులు నిర్లక్షం, వారి సహకారం వల్లనే ముఖేష్ ఇంత దారుణంగా ఇంటర్వూ ఇచ్చాడని పలువురు ఆరోపిస్తున్నారు.

అమ్మాయిలు రాత్రిపూట తిరగవద్దని చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జైలు అధికారులు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. డాక్యుమెంటరి తీసిన వ్యక్తి ఆ ఆడియో క్లిప్పింగ్‌లు ఎడిటింగ్ చేసి తమకు చూపించలేదని, అతను నియమాలు ఉల్లంఘించారని జైలు అధికారులు ఆరోపిస్తున్నారు. జైలు అధికారులు చెబుతున్న మాటలను కేంద్ర హోంశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

English summary
One of the main accused in the Nirbhaya gang rape gave a shocking interview recently blaming the victim for the fatal sexual assault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X