వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు మరోసారి నితీష్ షాక్: బీహార్‌లో కీలక మార్పులు?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్షాలకు షాకిచ్చారు. మంగళవారం విపక్షాలు భేటీ కానున్నాయి. ఈ భేటీకి నితీష్ గైర్హాజరవుతున్నారు. ఆయన పాట్నాలోనే ఉండనున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్షాలకు షాకిచ్చారు. మంగళవారం విపక్షాలు భేటీ కానున్నాయి. ఈ భేటీకి నితీష్ గైర్హాజరవుతున్నారు. ఆయన పాట్నాలోనే ఉండనున్నారు.

ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై విపక్షాలు సమావేశం ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ తరఫున జేడీయూ సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

అయితే అదే రోజున నితీశ్‌ తన పార్టీ నేతలతో కలిసి పట్నాలో సమావేశం కానున్నారని సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నితీశ్‌ ప్రతిపక్షాల నిర్ణయాన్ని పక్కనబెట్టి ఎన్డీయేకు మద్దతిచ్చారు.

మీరా బీహార్‌కే చెందిన వారే కానీ

మీరా బీహార్‌కే చెందిన వారే కానీ

మీరా కుమార్‌ బీహార్‌కు చెందిన వ్యక్తే అయినా నితీశ్‌ మాత్రం ఎన్డీయేకే పూర్తి మద్దతు తెలిపారు. తాజాగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించేందుకు 17 విపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశం కానున్నాయి.

నితీష్ తరఫున శరద్ యాదవ్

నితీష్ తరఫున శరద్ యాదవ్

కాంగ్రెస్‌ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే ఈ సమావేశానికి నితీశ్‌ తరఫున శరద్‌ యాదవ్‌ హాజరుకానున్నట్లు చెబుతున్నారు.

బీహార్ నుంచి ఎన్నుకుంటే..

బీహార్ నుంచి ఎన్నుకుంటే..

ఎన్డీయే గనుక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీహార్‌ నుంచి ఎన్నుకుంటే నితీశ్‌ మళ్లీ అధికార పక్షానికే మద్దతివ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతిస్తారని సమాచారం.

బీహార్‌లో కీలక మార్పులకు ఛాన్స్

బీహార్‌లో కీలక మార్పులకు ఛాన్స్

అదే గనుక జరిగితే బీహార్‌ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో లాలూ, నితీశ్‌లు భిన్నాభిప్రాయలు తెలిపారు.

విభేదాలు తప్పవా?

విభేదాలు తప్పవా?

ఉప రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అదే పునరావృతమైతే వారి మధ్య విభేదాలు తప్పవంటున్నారు. ఇంకోవైపు, లాలూ కుటుంబం అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంది. సీబీఐ, ఈడీ అధికారులు ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై వరుస దాడులు చేస్తున్నారు.

English summary
Bihar chief minister Nitish Kumar will skip the opposition’s meeting scheduled on Tuesday to discuss the vice-presidential election amid the undercurrent of tension between the Lalu Prasad’s Rashtriya Janata Dal and the Janata Dal(United).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X