వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాంసం.. శృంగారం వద్దు: గర్భిణీలకు ఆయుష్ సూచన.. అశాస్త్రీయమంటున్న హేతువాదులు

ముఖ్యంగా మాంసం తినవద్దంటూ గర్భిణీ స్త్రీలకు సూచించడం సరైంది కాదన్నారు. గర్భిణీ స్త్రీలు మాంసం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్, ప్రోటీన్ సంపూర్తిగా అందుతాయన్నారు. శాఖాహారం నుంచి లభించే ఐరన్,

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాసం తినవద్దు.. శృంగారానికి దూరంగా ఉండండి.. చెడు అలవాట్లను త్యజించండి.. గర్భిణీ స్త్రీల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ చేస్తున్న సూచనలివి. సంవత్సరానికి 26మిలియన్ల శిశువులకు జన్మనిస్తున్న దేశంగా.. ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని.. అలాంటప్పుడే ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిస్తారని చెబుతోంది.

గర్భిణీగా ఉన్న సమయంలో.. గదిలో ఆహ్లాదకరమైన అందమైన పోస్టర్లను అంటించుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. ఈ మేరకు మదర్ అండ్ చైల్డ్ కేర్ కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ పుస్తకాన్ని వెలువరించింది. బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన ఈ పుస్తకంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

 No meat, no sex, pure thoughts: Modi’s Ayush ministry gives tips to would-be moms for healthy baby

ఆరోగ్య నిపుణులు మరియు హేతువాదులు బీజేపీ తీరును తప్పుపడుతున్నారు. బీజేపీ మరియు కొన్ని హిందుత్వ గ్రూపులు కలిసి అశాస్త్రీయమైన సిద్దాంతాలను జనాల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చీ ఇన్ యోగా అండ్ నేచరోపతి డైరెక్టర్ డాక్టర్ ఐశ్వర్య మాత్రం ఈ వాదనను ఖండించారు. శృంగారానికి కచ్చితంగా దూరంగా ఉండాలని పుస్తకంలో ఎక్కడా చెప్పలేదన్నారు. దీనిపై స్పందించిన అపోలో వైద్యురాలు మాళవిక పుస్తకంలో పొందుపరిచిన అంశాలను తప్పుపట్టారు.

ముఖ్యంగా మాంసం తినవద్దంటూ గర్భిణీ స్త్రీలకు సూచించడం సరైంది కాదన్నారు. గర్భిణీ స్త్రీలు మాంసం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్, ప్రోటీన్ సంపూర్తిగా అందుతాయన్నారు. శాఖాహారం నుంచి లభించే ఐరన్, ప్రోటీన్ ల కన్నా ఇవి ఎక్కువ ప్రయోజనకం కలిగిస్తాయన్నారు. అదే సమయంలో ఎలాంటి సమస్యలు లేని గర్భిణీ స్త్రీలు సాధారణ శృంగారంలో పాల్గొనవచ్చునని చెబుతున్నారు.

గతవారం జామ్ నగర్ కేంద్రంగా పనిచేసే గర్భ్ విజ్ఞాన్ అనుసంధాన్ గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన సలహాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధం సంస్థగా పనిచేస్తుందన్న ఆరోపణలు దీనిపై ఉన్నాయి.

కాగా, ఉత్తమ సంతానం కలగాలంటే గర్భంతో ఉన్న సమయంలో శృంగారానికి దూరంగా ఉండాలంటూ గర్భ్ విజ్ఞాన్ అనుసంధాన్ గర్భిణీ స్త్రీలకు సూచిస్తోంది. అటు యోగా గురు రాందేవ్ బాబా సైతం పుత్ర బీజక్ మెడిసిన్ ప్రవేశపెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీన్ని సేవించడం ద్వారా మగపిల్లలే పుడుతారన్న ప్రచారం జరుగుతోంది.

English summary
Don’t eat meat, say no to sex after conception, avoid bad company, have spiritual thoughts and hang some good and beautiful pictures in your room to have a healthy baby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X