వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్‌పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు: సుష్మా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వార్తలపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ వార్తలపై ప్రధాని మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్ వార్తలపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మ ప్రశ్నించారు.

ఇక బీఎస్‌స్పీ అధినేత మాయావతి మాట్లాడుతూ ఇరాక్‌లో చిక్కుకున్న 39 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నట్లు చెప్పారు. బాధితులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

కిడ్నాప్ వార్తలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం ఉందో సభకు తెలియజేయాలని, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయల అంశంపై విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.

No proof of safety or killing of Indians kidnapped in Iraq: Sushma Swaraj

ఇరాక్‌లో చిక్కుకున్న గురైన 39 మంది భారతీయుల కోసం ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. భారతీయులు కిడ్నాపైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.

ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులు ఎక్కడ ఉన్నారో తెలియలేదని వివరించారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులు కోసం అధికారులు విచారణ జరుపుతున్నారని, వారు హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఐదుసార్లు కలిసినట్లు వెల్లడించారు.

36 మంది భారత ఖైదీలను విడుదల చేసిన పాకిస్ధాన్:

కరాచీ జిల్లాలోని మలీర్ జైలు నుంచి 36 మంది భారత్ ఖైదీలను పాకిస్థాన్ అధికారులు విడుదల చేశారు. వారిలో 35 మంది జాలర్లు కాగా, మరొకరు శిక్ష పూర్తి చేసుకున్న పౌరుడు. ఈ విషయాన్ని 'డాన్' ఆన్ లైన్ పత్రిక తెలిపింది. విడుదలయిన ఖైదీలను లాహోర్ దగ్గరలోని వాఘా సరిహద్దు నుంచి భారత్‌కు చేర్చనున్నారు.

English summary
External affairs minister Sushma Swaraj said on Friday that the government has no concrete proof of either the safety or killing of the 39 Indians kidnapped in Iraq in June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X