హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'139' ఎలా పనిచేస్తుంది?: ఫోన్‌కాల్‌తో రైలు టికెట్‌ రద్దు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుకోని కారణంతో ప్రయాణం రద్దు అయిందా? బుక్ చేసుకున్న రైలు టికెట్‌ను రద్దు చేసుకోవాలా? ఇందుకోసం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పనిలేదు. ఇకపై ఇంటినుంచే ఒక ఫోన్ కాల్‌తో రైలు టికెట్‌ను రద్దు చేసుకునే వెసులుబాటును రైల్వేశాఖ కల్పించింది.

ఈ తరహా కొత్త సౌకర్యాన్ని రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన '139' నెంబర్‌ను ఆయన శుక్రవారం ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానం కింద మనం బుక్ చేసుకున్న రైలు టికెట్ రద్దు చేసుకోవాలంటే '139'కు డయల్ చేసి మన టికెట్ వివరాలు చెబితే, వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది.

ఆ ఓటీపీని ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ వ్యవస్థ(పీఆర్‌ఎస్‌) కౌంటర్‌లో చెబితే టికెట్‌ డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ప్రయాణికులు, ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోలేనివారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా కూడా టికెట్‌ రద్దుకు వెసులుబాటును ఇప్పటికే కల్పించారు.

Now, cancel your train tickets by just dialing 139

రైల్వే బడ్జెట్‌లో పేర్కొన్న ఈ రెండు హామీలతో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం ఉంటుందని సురేశ్‌ ప్రభు అన్నారు. కాగా, మారిన రీఫండ్‌ నియమాలకు అనుగుణంగా.. టికెట్‌ రద్దు చార్జీలను రైల్వే రెట్టింపు చేసింది. 139, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ రద్దుకు అనుగుణంగా రైల్వే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయనున్నారు.

ఇదిలా ఉంటే విదేశీయులు, ప్రవాస భారతీయులు అంతర్జాతీయ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఐఆర్‌సీటీసీ నుంచి టికెట్‌ను బుక్‌ చేసుకునే వెసులుబాటునూ భారతీయ రైల్వే శాఖ తాజాగా కల్పించింది.

English summary
A person has to dial 139 and give details such as PNR number and train number of the confirmed ticket to get it cancelled. The sender will then get a one-time password (OTP) which he/she will have to give at the Passenger Reservation System ( PRS) counter to claim refund. Besides 139, one can also cancel confirmed tickets using the IRCTC website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X