వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో షాకింగ్ నిజం!: దారంతా పూలు పరిచి ఒబామాకు స్వాగతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా భారత్ పర్యటన నేపథ్యంలో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి! ఢిల్లీలోని పలుచోట్ల వాతావరణ కాలుష్యం భారత భద్రతా ప్రమాణాల కంటే మూడు రెట్లు అధికంగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల కంటే తొమ్మిది రెట్లు అధికంగా ఉంది.

గ్రీన్ పీస్ ఇండియా అనే ఎన్జీవో సంస్థ ఢిల్లీలోని ఆరు ప్రాంతాల్లో పరిశీలన చేసింది. రాజ్ ఘాట్, హైదరాబాద్ హౌస్ తదితర ప్రాంతాల్లో పరిశీలించింది. ఈ ప్రాంతాల్లో అనారోగ్యామని, ప్రమాదకరమైన కాలుష్యం ఉందని గుర్తించింది.

బరాక్ ఒబామా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఏ మేరకు కాలుష్యం ఉందని తాము పరిశీలించామని, తమ పరిశీలనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని, చాలా దారుణమైన వెదర్ కనిపించిందని, ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వెదర్ ఉందని గ్రీన్ పీస్ సంస్థ తెలిపింది.

Obama visit: pollution level ‘hazardous’ in Delhi

సెంట్రల్ ఢిల్లీలో 2.5 మైక్రాన్లు ఉంది, ఇది భారత్ భద్రతా ప్రమాణాలకు మూడు రెట్లు అని, అలాగే డబ్ల్యూహెచ్వో భద్రతా ప్రమాణాలకు తొమ్మిది రెట్లు అని చెప్పారు.

జన్ పథ్ వద్ద పీఎం2.5 కంటే తక్కువ ఉన్న రేణువుల గరిష్ట స్థాయి క్యూబిక్ మీటరుకు 264 మైక్రో గ్రాములు/క్యూబిక్ మీటర్లు ఉందని, హైదరాబాద్ హౌస్ వద్ద 239 మైక్రోగ్రామ్స్/క్యూబిక్ మీటర్‌గా ఉందని తెలిపింది. రాజ్ ఘాట్ వద్ద 229 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌గా ఉందన్నారు.

ఒబామాకు పువ్వులతో స్వాగతం

ఒబామాకు భారత ప్రభుత్వం పువ్వులతో పలు రకాలుగా స్వాగతం చెప్పింది. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఒబామాకు దారి పొడగునా పువ్వులతో తీర్చిదిద్దిన హోర్డింగులు కనువిందు చేశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తెప్పించిన 70 సైన్ బోర్డులు, 21 ఫ్లవర్ ఫౌంటేన్లు, 16 పెద్ద జంతువుల బొమ్మలు తీర్చిదిద్ది ఒబామా ప్రయాణించే మార్గంలో అలంకరించారు. భారత్ - అమెరికా మైత్రి సంబంధాన్ని వివరించేలా బోర్డులు ఉన్నాయి.

English summary
A study conducted at six places, U.S. President Barack Obama is slated to visit, has found that air pollution levels are three times more than Indian safety standards and nine times than the WHO limit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X