వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 చోట్ల నుంచి ఒమర్ పోటీ, భద్రతా దళాలను లక్ష్యంగా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజక వర్గమైన గందేర్బల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు. ఈ సారి సోన్‌వార్, బీర్వా నియోజక వర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 87 అసెంబ్లీ స్ధానాలకు గాను ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి దశ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండవ దశ డిసెంబర్ 2న, డిసెంబర్ 9న మూడో దశ, డిసెంబర్ 14న నాలుగో దశ, 20న ఐదో దశ పోలింగ్ నిర్వహించనున్నారు.

Omar dumps Ganderbal, to contest from Sonawar and Beerwah

జమ్ము కాశ్మీర్-లో మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ‘నోటా' ఓటు కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23న ఉంటుంది. జమ్ము కాశ్మీర్-లో 10,015 పోలింగ్ బూత్-లు, జార్ఖండ్-లో 24,648 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రత సిబ్బంది పేలుడు పదార్ధాన్ని నిర్వీర్యం చేసినట్లు పోలీసుల తెలిపారు.

మొఘల్ రోడ్డు సమీపంలో చిన్న గ్యాస్ సిలిండర్‌లో ఐదు కేజీల బరువున్న ఐఈడీ లభ్యమైనట్లు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లే భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోని దీనిని అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదు దశల్లో జరగనున్న ఎన్నికల పోలింగ్ నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది.

English summary
Jammu and Kashmir Chief Minister Omar Abdullah decided Friday to contest assembly elections from Sonawar and Beerwah constituencies, instead of seeking re-election from his family's traditional Ganderbal seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X