వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది? (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ రెండు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సోనోవాల్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.

అసోంలో 15 ఏళ్ల గోగోయ్ పాలనకు అంతం పలికి అక్కడి ప్రజలకు బీజేపీకి పూర్తి మెజారిటీని కట్టబెట్టడంతో సోనోవాల్ ప్రమాణ స్వీకార వేడుకలో బీజేపీ బలప్రదర్శనకు దిగింది. ఈశాన్య భారతంలోని ఓ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో సోనోవాల్ ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు, వీఐపీలు అందరూ హాజరయ్యారు.

ఈ ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు, వీఐపీలతో సహా మొత్తం 102 మంది బీజేపీ నేతలతో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి గౌహతికి బయల్దేరడం విశేషం. తొలుత రైల్వే శాఖ మంత్రి చిన్న ట్రావెల్ బ్యాగుతో విమానం ఎక్కగా, సహచర మంత్రులు నిర్మలా సీతారామన్, వీకే సింగ్ తదితరులు కూడా ఎక్కారు.

ఇక ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్, బెంగళూరు ఎంపీ అనంతకుమార్‌లతో పాటు ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఇలా కేంద్ర మంత్రులు బిజినెస్ క్లాస్ సీట్లలో, జూనియర్ మంత్రులు, ఇతర వీఐపీలు ప్రీమియం ఎకానమీ సీట్లలో కూర్చుండగా విమానం టేకాఫ్ అయింది.

 బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?

బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?


అదే విమానంలో ఉన్న ప్లేబ్యాక్ సింగర్ బాబుల్ సుప్రియోతో అనురాగ్ ఠాకూర్ ముచ్చట్లలో పడిపోయారు. కేంద్ర మంత్రులు తమ సెల్ ఫోన్లలో బిజీ అయిపోయి, తమ వారికి ఆదేశాలు జారీ చేస్తూ కనిపించారు. ఓ పాట పాడాలని సుప్రియోను పలువురు కోరగా, ఆయన తన గొంతు బాగాలేదని అన్నారు.

 బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?

బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?


విమానం టేకాఫ్ అయి, సీట్ బెల్టులు తొలగించుకోవచ్చన్న సంకేతాలు వెలువడగానే ఇక కబుర్లలో మునిగినవారు కొందరైతే, కాసింత సమయం దొరికిందని మరికొందరు ఓ కునుకు తీశారు. నిర్మలా సీతారామన్ పక్కన చేరిన అనంతకుమార్, కర్ణాటక నుంచి రాజ్యసభ నామినీ ఎవరన్న విషయమై చర్చించారు.

 బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?

బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?


వెంకయ్యనాయుడికి ఈ దఫా ఎక్కడి నుంచి అవకాశం లభిస్తుంది? మీరు ఏ రాష్ట్రం నుంచి కొనసాగుతారు? వంటి ప్రశ్నల వర్షాన్ని ఆయన సంధించారు. ఇక ప్రయాణం మధ్యలో మంత్రులు, ప్రజాప్రతినిధుల ఏవేవో మాట్లాడుకున్నారు.

బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?

బీజేపీ నేతల స్పెషల్ ఫ్లైట్: ఏం జరగింది?

విమానం దిగే సమయంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారం మొత్తాన్ని తాను లైవ్ ట్వీట్లుగా అందిస్తానని సహచరులకు తెలిపారు. విమానం దిగీ దిగగానే, తమకోసం అక్కడే సిద్ధంగా ఉంచిన కార్లలో మంత్రులు, వీఐపీలు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వెళ్లారు.

English summary
There would be some pleasure at the end of the journey - the swearing in of the BJP's first government in Assam - but on the plane there, it was nearly all business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X