పన్నీర్ సెల్వం రంగుపడింది: శపథం చేసిన మాజీ సీఎం: పళనిసామి వర్గం హడల్ !

Subscribe to Oneindia Telugu

సేలం/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ (అన్నాడీఎంకే పురచ్చితలైవి అమ్మ) నాయకుడు పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు ఊహించని రీతిలో ప్రజల నుంచి మద్దతు వస్తోంది. శుక్రవారం రాత్రి సేలంలో జరిగిన బహిరంగ సభకు వేలాధి మంది ప్రజలు తరలివచ్చారు.

జయా టీవీ చేతులు మారింది: దిక్కులేరని, శశికళ ఆస్తులు మొత్తం ఆయన చేతికే !

అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం వర్గంలోని కార్యకర్తలతో పాటు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభిమానులు వేలాది మంది పన్నీర్ సెల్వం బహిరంగ సభకు హాజరైనారు. పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో పన్నీర్ సెల్వం మరింత హూషారుగా బహిరంగ సభలో ప్రసగించారు.

ఆ విషయంలో వెనక్కి తగ్గం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎలా మరణించారు, ఆమెకు వైద్యులు ఎలాంటి వైద్య చికిత్స అందించారు అనే విషయంపై సీబీఐతో దర్యాప్తు చేయించే వరకు పోరాటం చేస్తానని పన్నీర్ సెల్వం బహిరంగ సభలో చెప్పారు.

శపథం చేసిన పన్నీర్ సెల్వం

జయలలిత మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించే వరకు తాను నిద్రపోనని పన్నీర్ సెల్వం ఇదే సందర్బంలో శపథం చేశారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి జయలలిత మీద గౌరవం ఉంటే వెంటనే సీబీఐతో దర్యాప్తుకు ఆదేశించాలని సవాలు చేశారు.

అమ్మ అభిమానులు మనమే

జయలలితకు అసలైన అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు మనమే అంటూ పన్నీర్ సెల్వం చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వర్గంలోని నాయకులను గెలిపించుకుని అమ్మ అభిమానుల సత్తాచాటడానికి మీరు సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దద్దమ్మలు ఉంటే ఇలాగే ఉంటుంది

తమిళనాడులో ప్రస్తుతం దద్దమ్మ ప్రభుత్వం ఉందని ఎడప్పడి పళనిసామి మీద విరుచుకుపడ్డారు. సొంతంగా ఓ నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం అధికారంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా శశికళ కుటుంబ సభ్యులు కాపాడటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

దమ్ముంటే ఎన్నికలకు సిద్దం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే తమిళనాడులో శాసన సభ ఎన్నికలు వస్తాయని పన్నీర్ సెల్వం మరోసారి చెప్పారు. దమ్ముంటే శాసన సభ ఎన్నికలకు మీరు సిద్దం కావాలని, మేను సిద్దంగానే ఉన్నామని పన్నీర్ సెల్వం ప్రత్యక్షంగానే శశికళ వర్గానికి సవాలు విసిరారు.

శశికళ, దినకరన్ జైల్లో ఉంటే వీళ్లు మాత్రం ?

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ, ఢిల్లీలోని తీహార్ జైల్లో టీటీవీ దినకరన్ ఉన్నారని, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు వారిద్దరినీ ఎలాకాపాడుకోవాలి అనే ఆలోచన తప్పా తమిళనాడు ప్రజల సమస్యల గురించి, పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకునే ఆలోచనేలేదని మండిపడ్డారు.

ప్రజల సంపూర్ణ మద్దతు

పన్నీర్ సెల్వం తమిళనాడు రాష్ట్ర పర్యటనకు ప్రజల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. గత శుక్రవారం రాత్రి మదురైలో సీఎం ఎడప్పాడి పళనిసామి బహిరంగ సభలో కేవలం వందల మంది పార్టీ కార్యకర్తలు హాజరైనారు. అదే రోజు కాంచీపురంలో పన్నీర్ సెల్వం బహిరంగ సభకు దాదాపు లక్ష మంది హాజరైనారు. సేలంలో జరిగిన బహిరంగ సభలో పన్నీర్ సెల్వంకు కత్తి బహుమతిగా ఇచ్చిన కార్యకర్తలు త్వరలో మీరే సీఎం అవుతారని నినాదాలు చేశారు.

English summary
Panneerselvam is having a state wide tour for gaining public support.Massive crowd welcoming Puratchithalaivi Amma's loyalist in Salem. He delivered energizing speech to AIADMK workers in Salem.
Please Wait while comments are loading...